ఇందిరమ్మ కమిటీ రద్దుచేసి కొమరం భీమ్ కమిటీని నియమించాలి

ఇందిరమ్మ కమిటీని రద్దుచేసి కొమరం భీమ్ కమిటీని నియమించాలి.
జి.ఎస్.పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర డిమాండ్.
వెంకటాపురం తెలంగాణ వార్త జనవరి 26:- వెంకటాపురం మండల కేంద్రంలో ఆర్ ఎం బి గెస్ట్ హౌస్ ఆవరణలో జిఎస్పీ సమావేశం పూనెం ప్రతాప్ అధ్యక్షతన జరిగిన సమావేశంఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో జిఎస్పి రాష్ట్ర కార్యదర్శి పూనెం సాయి దొర మాట్లాడుతూ ఐదవ షెడ్యూల్ భూభాగములోఏజెన్సీ ప్రాంతంలో ఇందిరమ్మ కమిటీలను తక్షణమే రద్దుచేయాలని అన్నారు.ఏజెన్సీ ప్రాంతాన్ని కాపాడిన ఆదివాసి పోరాట యోధుడు కొమరం భీం కమిటీని ఈ ప్రభుత్వం నియమించాలని ఆయన డిమాండ్ చేశారు. 19 76లో ఆదివాసీల కులంలోకి లంబాడీలని కలిపిన ఈ కాంగ్రెస్ ప్రభుత్వమేనని ఆదివాసులకు గుర్తు చేశారు.చతీష్ ఘడ్,ఒరిస్సా, మధ్యప్రదేశ్, రాష్ట్రాలలో లంబాడీలు ఓసి, బీసీ,లుగా చలమని అవుతున్నప్పటికీ ఈ తెలంగాణ ప్రభుత్వంలో ఎలా ఎస్టీలు అవుతారని ఆయన సూటిగా ప్రశ్నించారు. 19 76 లో కాంగ్రెస్ పార్టీ లంబాడీలను ఎస్టీ జాబితాలో ఓటు బ్యాంకు రాజకీయం కోసమే విలీనం చేశారనిఅన్నారు.త్వరలో సర్పంచ్ ఎన్నికల్లో మాత్రం ఏజెన్సీ ప్రాంతానికి కాంగ్రెస్ పార్టీ ని రాకుండా అడ్డుకుండే బాధ్యత ఆదివాసులపై ఉందనిఅయన అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఆదివాసుల కోసం ఏం చేసిందని ఆయన సూటిగా ప్రశ్నించారు.ఏజెన్సీ ప్రాంతంలోకి సర్పంచ్ ఎన్నికల్లోకి వస్తే మాత్రం కాంగ్రెస్ పార్టీని బొంద పెడతామని ఆయన ఘాటుగా విమర్శించారు.ఈకార్యక్రమంలో కారం నాగేశ్వరావు, తదితరులు పాల్గొన్నారు.