సూర్యాపేట లో దోమల నివారణలో మున్సిపాలిటీ విఫలం
మూడుసార్లు ఎమ్మెల్యే గెలిచిన నీటి సరఫరా చేయడంలో జగదీశ్ రెడ్డి విఫలం
సూర్యాపేట మున్సిపాలిటీకి చైర్మన్ ఉన్నారా??
బీజేపీ ఫ్లోర్ లీడర్, 30వ వార్డు కౌన్సిలర్ పల్స మహాలక్ష్మిమాల్సుర్ గౌడ్
సూర్యాపేట పట్టణంలో దోమలను నివారించడం, మంచినీటి సరఫరా చేయడంలో మున్సిపాలిటీ పాలకవర్గం, స్థానిక శాసనసభ్యులు జగదీష్ రెడ్డి పూర్తిగా విఫలం అయ్యారని బిజెపి జిల్లా అధికార ప్రతినిధి పల్స మల్సూర్ గౌడ్, 30 వార్డ్ కౌన్సిలర్,బిజెపి ఫ్లోర్ లీడర్ పల్స మహాలక్ష్మి మల్సూర్ గౌడ్ లు ఒక సోమవారం ఒక ప్రకటనలో అరోపించారు. పారిశుధ్య లోపం మూలంగా వార్డులలో దోమల బెడదతొ ప్రజలు విష జ్వరాలు, అంటువ్యాధుల బారినపడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రతినిత్యం సాయంత్రం దోమల నివారణ మందులు పిచికారి చేయాలనీ కోరారు. సంబంధిత అధికారులను అడగగా దోమల మందు లేదు అని నిర్లక్ష్య సమాధానం చెప్తున్నారని, మరి చైర్మన్ ఏం చేస్తున్నారని వారు ప్రశ్నించారు. సూర్యాపేట నియోజకవర్గం నుండి మూడు సార్లు ఎమ్మెల్యే గా గెలిచిన జగదీష్ రెడ్డి త్రాగునిటీ ని పట్టణ ప్రజలకు అందిచడంలో పూర్తిగా విఫలం అయ్యారని అన్నారు. బి ఆర్ ఎస్ ప్రభుత్వం పది సంవత్సరాలు అధికారం లో ఉన్నా పట్టణంలో నీటి సమస్య ను మాత్రం తీర్చలేదు అన్నారు. ఇప్పుడున్న ప్రభుత్వమై నా వేసవి కాలం సమిపించడంతో సూర్యాపేట పట్టణ ప్రజలకు ఇబ్బందులు లేకుండా నీటిని సరఫరా చేయాలనీ కోరారు. పట్టణంలో దోమలను అరికట్టడంలోను, మంచినీటి సరఫరా చేయడంలోనూ అధికారులు సరైన సమయంలో చర్యలు తీసుకోకుండా అలసత్వం వహిస్తే ఆందోళన చేస్తామని హెచ్చరించారు.