*28న సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని పోస్టర్ల ఆవిష్కరణ.*

Dec 24, 2024 - 19:19
Dec 24, 2024 - 22:41
 0  33
*28న సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని పోస్టర్ల ఆవిష్కరణ.*

28న సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని పోస్టర్ల ఆవిష్కరణ.

ఇల్లందు తెలంగాణ వార్త డిసెంబర్ 24:-  డిసెంబరు 28న హైదరాబాదులోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరిగే రెండు సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీల విలీన సభను జయప్రదం చేయాలని కోరుతూ ఈరోజు ఇల్లందు కొత్త బస్టాండ్ సెంటర్లో పోస్టర్లు ఆవిష్కరించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ జిల్లా సహాయ కార్యదర్శి గౌని నాగేశ్వరరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో సిపిఐ (ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు ఆవునూరి మధు, రాష్ట్ర నాయకులు జే.సీతారామయ్య, తుపాకుల నాగేశ్వరరావులు మాట్లాడుతూ..

 2013లో వివిధ కారణాల రీత్యా విడిపోయిన న్యూ డెమోక్రసీ పార్టీలు నేడు విలీనం అవ్వాలనుకోవడం శుభ పరిణామం అన్నారు. దేశంలో మతోన్మాద బిజెపి మోడీ ప్రభుత్వం ఫాసిస్టు విధానాలతో ప్రజలను అరిగోస పెడుతున్నారని, సామ్రాజ్యవాద కంపెనీలకు దేశ సంపదను కట్టబెడుతున్నారని, మతం పేరుతో చిచ్చు పెట్టి మనుషుల మధ్య వైశ్యామ్యాలు సృష్టిస్తు నరహంతక పాలన కొనసాగిస్తున్నారని విమర్శించారు.

రచయితలను,మేధావులను, కళాకారులను, హక్కుల నేతలను నక్సలైట్లంటూ అక్రమ కేసులు బనాయించి చిత్రహింసలు పెట్టి జైల్లో నిర్బంధిస్తున్నారని ఆవేదన చెందారు. ఇటువంటి పరిస్థితులలో దేశంలో ఉన్న విప్లవ పార్టీలన్నీ కలవాలని, ప్రజలందరిని సమీకృతం చెయ్యాలని కోరారు.అందులో భాగంగా సిపిఐ(ఎం-ఎల్) న్యూడెమోక్రసీ రెండు విప్లవ పార్టీలు డిసెంబర్ 28న సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో విలీనం అవుతున్నాయని తెలిపారు. కామ్రేడ్ చండ్ర పుల్లారెడ్డి గారు రూపొందించిన ప్రజా యుద్ధ పంధా ప్రతిఘటన పోరాటలను మరింత ముందుకు తీసుకుపోవడానికి ఈ కలయిక దోహదపడుతుందని అన్నారు. ప్రజలు, ప్రజాస్వామికవాదులు, రెండు న్యూ డెమోక్రసీ పార్టీల పార్టీల కార్యకర్తలు 28న జరిగే సభకు హాజరై జయప్రదం చేయాలని కోరారు.

 ఈ కార్యక్రమంలో నాయకులు ముక్తి సత్యం, ఎస్కే ఉమర్, కొక్కు సారంగపాణి,

Md.రాసుద్దీన్ పొడుగు నరసింహారావు, పరిశిక రవి, కుంజ కృష్ణ, తోడేటి నాగేశ్వరరావు, చింత ఉదయ్, పూనం రంగన్న, బచ్చలి సారన్న, బట్టు ప్రసాద్, కల్తి వెంకటేశ్వర్లు, మోకాళ్ళ రమేష్, వెంకటక్క, రేళ్ళ నాగలక్ష్మి, సూర్ణపాక నాగేశ్వరరావు, ఎట్టి నరసింహారావు,హార్జ్య, వాంకుడోత్ మోతిలాల్, వాంకుడోత్ శ్రీను, బానోతు సంతు, మాలు తదితరులు పాల్గొన్నారు

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్