నూతన పద్ధతులతో అధిక లాభాలు

Mar 8, 2024 - 19:10
 0  3
నూతన పద్ధతులతో అధిక లాభాలు

వ్యవసాయరంగంలో ఆధునిక విజ్ఞానాన్ని జోడిస్తే మెరుగైన ఫలితాలు
కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని
చుంచుపల్లి : వ్యవసాయ రంగంలోకి వచ్చిన నూతన పద్ధతులలో అవలంబిస్తే తక్కు ఖర్చుతో అధిక దిగుబడిని పొందేందుకు వీలుంటుందని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. త్రి ఇంక్లైన్ కృషి విజ్ఞాన కేంద్రంలో గురువారం ఏర్పాటుచేసిన కిసాన్ మేళా కార్యక్రమాన్ని జ్యోతి ప్రజ్వలన చేసి అయన ప్రారంభించారు. అనంతరం జరిగిన సదస్సులో కూనంనేని మాట్లాడాతూ వ్యవసాయరంగంలో అధునాతన పరిజ్ఞానాన్ని జాడిస్తేనే ఆశించిన ఫలితాలు దక్కుతాయని అన్నారు. ప్రస్తుతం అధునాతనమైన వ్యవసాయ పరికరాలు అందుబాటులోకి వచ్చాయని వాటి ద్వారా పెట్టుబడితోపాటు సమయం ఆదా అవుతుందని చెప్పారు. వ్యవసాయశాఖ, ఉద్యానవనశాఖ అధికారులు ఎప్పటికప్పుడు తగిన సలహాలు సూచనలు అందజేయాలని, శాస్త్ర వేత్తలు క్షేత్రస్థాయిలో పర్యటించి వ్యవసాయాన్ని లాభసాటిగా మార్చుకునే అంశాలపై రైతులకు అవగాహల కల్పించాలని కోరారు., ఈ సందర్బంగా పలువురు అభ్యుధయన రైతులను శాలువాలతో సత్కరించి జ్ఞాపికలను అందజేశారు.  అనంతరం వివిధ కంపినీలు, వివ్యవసాయ శాఖా అధికారులు ఏర్పాటుచేసిన స్టాల్స్ను తిలకించారు. కార్యక్రమంలో అధికారులు బాబు రావు, సూర్యనారాయణ, వెంకట్రావు, దామోదరరెడ్డి, వీరహన్మంతరావు, అలీ, రమేష్ కుమార్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కె సాబీర్ పాషా, రవి సీడ్స్ అధినేత రవి, వ్యవవసాయ శాఖా, అనుబంధ శాఖల అధికారులు దేశి డీలర్లు, వివిధ సంస్థల ప్రతినిధులు, అభ్యుదయ రైతులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333