నో పార్కింగ్‌లో వాహనాలు నిలిపితే ‘వీల్‌ లాక్‌’:ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు

Feb 5, 2025 - 20:52
Feb 5, 2025 - 20:55
 0  2
నో పార్కింగ్‌లో వాహనాలు నిలిపితే ‘వీల్‌ లాక్‌’:ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు
నో పార్కింగ్‌లో వాహనాలు నిలిపితే ‘వీల్‌ లాక్‌’:ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు

బైక్‌, కారు ఏదైనా అంతే...

స్పెషల్‌ డ్రైవ్‌ ప్రారంభించిన ట్రాఫిక్ ఎస్సై


జోగులాంబ గద్వాల 5 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- గద్వాల పట్టణం:- లో పొరపాటున నో పార్కింగ్‌లో వాహనం పెడితే వాహనాలకు ‘వీల్‌ లాక్‌’ చేయడం జరుగుతుంది అని ట్రాఫిక్ ఎస్సై బాలచంద్రుడు తెలియజేశారు. జరిమానా చెల్లించాకే అది తీసి, వాహనం ఇవ్వడం జరుగుతుంది అని ఆయన తెలియజేశారు. బుధవారం గద్వాల పట్టణంలోని మున్సిపాలిటీ  పరిధిలో ఉన్న లింగం బావి దగ్గర రోడ్డుపైన ఎలాంటి అనుమతులు లేకుండా ఉంచిన వాహనాలకు ట్రాఫిక్ ఎస్ఐ   తన సిబంది కలిసి స్వయంగా స్పెషల్‌ డ్రైవ్‌ చేపట్టారు.ఈ సందర్భంగా ట్రాఫిక్ ఎస్ఐ బాలచంద్రుడు మాట్లాడుతూ గద్వాల పట్టణంకి ఒక ప్రత్యేకత ఉందని,ఎంతోమంది పర్యాటకులు వస్తున్నారని,అయితే రహదారి నియమాలు,భద్రత పాటించకపోవడం వల్ల రోజూ కనీసం ఒకరిద్దరు ప్రాణాలు కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తంచేశారు.పట్టణ ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించి, రహదారి భద్రత పాటించేలా, ప్రమాదాలు నివారించేందుకు యత్నిస్తున్నామన్నారు.ముఖ్యంగా నో పార్కింగ్‌లో వాహనాలు పెడుతున్నారని, ఫుట్‌పాత్‌లు ఆక్రమిస్తున్నారని,వీటికి చెక్‌ పెట్టేందుకే తొలుత చర్యలు చేపట్టామన్నారు.ప్రజలకు ట్రాఫిక్‌పై అవగాహన కల్పించేందుకే ఈ ప్రయత్నం చేస్తున్నామని, ఎవరినీ ఇబ్బంది పెట్టడానికి కాదని ఆయన వివరించారు.ప్రజలు దీనికి సహకరించాలన్నారు.మైనర్‌ డ్రైవింగ్‌, లైసెన్స్‌ లేకుండా డ్రైవింగ్‌ చేయడం వంటివి కూడా నివారిస్తామన్నారు.డ్రంకన్‌ డ్రైవింగ్‌పై కూడా దృష్టి పెట్టామని, మద్యం తాగి వాహనాలు నడిపే వారిపై చర్యలు తీసుకుంటామన్నారు.స్పెషల్‌ డ్రైవ్‌లో భాగంగా పలు వాహనాలకు వీల్‌ లాక్స్‌ వేశారు.

G.THIMMA GURUDU Jogulamba Gadwal Staff Reporter Jogulamba Gadwal District Telangana State