శ్రీ తిమ్మప్ప స్వామి దేవాలయంలో భక్తుల సందడి.
జోగులాంబ గద్వాల 15 జూన్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయంలో శనివారం భక్తుల సందడి నెలకొంది. ఉదయం దేవాలయంలో అర్చకులు, వాల్మీకి పూజారులు అభిషేకాలు, అర్చనలు, మంగళహారతి నిర్వహించారు. దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో భక్తులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా దేవాలయ సిబ్బంది అందుబాటులో ఉండి సేవలు అందించారు. ఈ సందర్భంగా దేవాలయానికి వచ్చిన భక్తులకు దేవాలయం తరఫున అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పట్వారి అరవిందరావు చంద్రశేఖర రావు తదితరులు పాల్గొన్నారు.