ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారించాలి

Jul 8, 2024 - 19:47
Jul 8, 2024 - 20:21
 0  10
ఆశా వర్కర్ల సమస్యలు పరిష్కారించాలి

జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు వినతిపత్రం అందజేసిన ఆశా వర్కర్లు.

సూర్యాపేట. 08 జులై 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- ఆశా వర్కర్ల  సమస్యలు పరిష్కరించాలని కోరుతూ సూర్యాపేట జిల్లా కలెక్టర్ తేజస్ నందలాల్ పవార్ కు ఆశావర్కర్ల‌సంఘం ఐఎన్ టియుసి యూనియన్ ఆధ్వర్యంలో  జిల్లా కలెక్టర్ కార్యాలయం నందు జరిగిన ప్రజావాణి కార్యక్రమం లో ఆశా వర్కర్లు వినతిపత్రం అందజేసినారు. ఈ సందర్భంగా ఆశావర్కర్ల యూనియన్ రాష్ట్ర నాయకురాలు కళమ్మ మాట్లాడుతూ ఆశావర్కర్లకు వేతనాలు 18000/- లకు  పెంచాలని, పెద్ద గ్రామపంచాయతిలలో జనాభా అధికంగా వున్న గ్రామాలలో మరొక ఆశా వర్కర్ ను నియమించి, ప్రస్తుతం సేవలు అందిస్తున్న ఆశా వర్కర్ కు పనిభారం తగ్గించాలని విజ్ఞప్తి చేశారు. అర్హత కలిగిన ఆశా వర్కర్ లను ఎ ఎన్ ఎమ్ లుగా నియమించాలని విజ్ఞప్తి చేశారు.

ఆధార్ కార్డు ఆన్ లైన్ చేసే పనులు తమకు అప్పగించవద్దని తెలిపారు. లెప్రసీ శాంపిల్ సేకరణ విధుల నుండి ఆశా వర్కర్ లను తప్పించాలని విజ్ఞప్తి చేశారు.  ఎఎమ్ సి లకు టార్గెట్ లు పెట్టవద్దని తెలిపారు.  జిల్లా కలెక్టర్ కు వినతిపత్రం అందజేసిన వారిలో  గోపగాని విజయ యూనియన్ జిల్లా అధ్యక్షురాలు, అవిరెండ్ల సీత ప్రధాన కార్యదర్శి,  విజయకుమారి జిల్లా  కోశాధికారి, సీత జిల్లా ఉపాధ్యక్షురాలు, ఊట్కూరి సుజాత, జయమ్మ, ధూపాటి శోభ, మాసవెల్లి మాధవి, మహేశ్వరి, సునీత, స్వప్న , ఎమ్ సునీత, మరియమ్మ, సుశీల, హేమలత తదితరులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333