వైద్యురాలిపై దాడిని తీవ్రంగా ఖండించిన

సూర్యాపేట ఇండియన్ మెడికల్ అసోసియేషన్

Aug 13, 2024 - 21:16
Aug 13, 2024 - 21:29
 0  32
వైద్యురాలిపై దాడిని తీవ్రంగా ఖండించిన

కలకత్తాలో వైద్యురాలిని రేప్ చేసి హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించాలి

 వైద్యుల రక్షణ కోసం దేశవ్యాప్తంగా చట్టం తీసుకుని రావాలి.

సూర్యాపేట 14 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- కలకత్తాలో ట్రైనీ డాక్టర్ ని రేప్ చేసి దారుణంగా హత్య చేసిన నిందితుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తూ సూర్యాపేట పట్టణంలో ఐఎమ్ ఎ ఆధ్వర్యంలో వైద్యులు, వైద్య కళాశాల విద్యార్థులు కొవ్వొత్తుల ర్యాలి నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైద్యులు రామ్మూర్తి యాదవ్, రమేష్ నాయక్ లు మాట్లాడుతూ కలకత్తా లో వైద్యురాలిపై దాడి చేసి హత్య చేయడం అత్యంత దారుణమని, దేశంలో వైద్యులకు రక్షణ లేకుండా పోయిందని అన్నారు. దేశవ్యాప్తంగా వైద్యుల రక్షణ కోసం ప్రత్యేక చట్టం తీసుకుని రావాలని అన్నారు.

  వైద్య కళాశాలలు, ఆసుపత్రులు పెరుగుతున్నాయి కాని సెక్యూరిటీ వ్యవస్థ లేదని అన్నారు. ప్రతి ప్రభుత్వ ఆసుపత్రి వద్ద సెక్యూరిటీ వ్యవస్థ ఏర్పాటు చేయాలని, సిసిటివిలు ఏర్పాటు చేయాలని అన్నారు. కలకత్తా సంఘటన లో న్యాయం జరిగేవరకు తమ పోరాటం ఆగదని, వైద్య సేవలు నిలుపుదల చేస్తామని అన్నారు. నిందితుని కఠినంగా శిక్షించాలని గతంలో తెలంగాణ రాష్ట్రములో ఇటువంటి సంఘటనలు జరిగినప్పుడు నిందితులను ఎన్ కౌంటర్ చేశారని, కలకత్తా సంఘటనలో నిందితుని కాల్చి చంపాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఐఎమ్ ఎ సూర్యాపేట అధ్యక్షులు డాక్టర్ ఆనంద్, రమేష్ చంద్ర, వైద్యులు డాక్టర్ ప్రమీల, డాక్టర్ మాధవి రుద్ర, డాక్టర్ శాలిని డాక్టర్ శిరీష, సీనియర్ డాక్టర్ బి ఎం చంద్రశేఖర్ , మెడికల్ కళాశాల విద్యార్థులు, హౌస్ సర్జరీస్ వైద్య కళాశాల విద్యార్థులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు పాల్గొన్నారు.

Shake Jaheer Staff Reporter Suryapet District Telangana 508223