మా వాటా మాకే పుస్తకం ఆవిష్కరణ..

సూర్యాపేట. 14 ఆగస్టు 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- సూర్యాపేట జిల్లా కేంద్రంలో మహాత్మా జ్యోతిబాపూలే విగ్రహం ముందు వివిధ కుల సంఘాల నాయకులతో పాటు సామాజిక ఉద్యమ నాయకులు తౌడోజు సలేంద్రాచారి ఆధ్వర్యంలో ఆవిష్కరించారు.మంగళవారం ఈ ఆవిష్కరణ సందర్భంగా ముఖ్యఅతిథిగా బిసి సంక్షేమ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు తన్నీరు రాంప్రభు, రాష్ట్ర నాయకులు ఖమ్మంపాటి బిక్షపతి గౌడ్ మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రంలో మెజార్టీ ప్రజలు బిసిలు. బిసి లోని కులాలు విద్యాపరంగా, ఉద్యోగ పరంగా,సామాజికపరంగా, రాజకీయపరంగా,అన్ని రంగాలలో వెనుకంజులో ఉన్నారని మా వాటా మాకు దక్కాలని కోరుతూ అన్ని కులాలలో చైతన్యం తీసుకొని రావడం జరుగుతుందని అన్నారు.
రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి రాకముందు కులగణన చేస్తామని హామీ ఇవ్వడం జరిగిందని, ఆ హామీ ప్రకారం తెలంగాణ రాష్ట్రంలోని అన్ని కులాలు సంఘటితమై తమ ఓటు హక్కును వినియోగించుకొని కాంగ్రెస్ పార్టీని అధికారంలోకి తీసుకురావడం జరిగిందని అన్నారు. ప్రభుత్వం ఏర్పడి 8 నెలలు అయినా కులగణన చేయకపోవడం బీసీలను విస్మరించడం అని అన్నారు. బీసీలపై ప్రేమ ఉంటే బీసీల పక్షపాతి అని అనుకుంటే, కులగణన జరిపి ,స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లు అమలుపరచి ఎన్నికలు నిర్వహించాలని కోరారు. లేకపోతే రాష్ట్రంలో ఉన్నటువంటి అన్ని కుల సంఘాలతో రాష్ట్రస్థాయి,లో జిల్లా,స్థాయిలో మండల స్థాయి లో సమావేశాలు సభలు ఏర్పాటు చేసి, ప్రజలను చైతన్యపరచుకొని హక్కులను సాధించుకుంటామని అన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు పున్నం విష్ణు, అమరవాది శ్రవణ్, బహురోజు ఉపేందర్, మేడారపు బ్రహ్మచారి, జక్కలి రాజు, నర్సింగోజు వీరాచారి, ఓరోజు వెంకటా చారి, వీరచారి,వివిధ బీసీ సంఘాల నాయకులు తదితరులు పాల్గొన్నారు.