మాదారం గ్రామంలో సిసిఐ కేంద్రాన్ని ప్రారంభించిన ఎమ్మెల్యే శాలిగౌరారం

06 నవంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- తుంగతుర్తి నియోజకవర్గం నల్గొండ జిల్లా శాలిగౌరారం మండల పరిధిలో మాదారం గ్రామంలో తుంగతుర్తి శాసనసభ్యులు మందుల సామేల్ సీసీఐ పత్తి కొనుగోలు కేంద్రంని ప్రారంభించారు.ముఖ్య అతిథులుగా విచ్చేసిన తుంగతుర్తి శాసనసభ్యులు
మందుల సామేల్ ఈ సందర్భంగా మాట్లాడుతూ..పండించిన పంట పత్తి రైతు పంటను మద్దతు ధర7500 రూపాయలకు అమ్ముకోవాలని కోరారు.దళారుల చెప్పే మాటలు నమ్మొద్దని వారి చేతిలో మోసపోవద్దని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, నాయకులు,వివిధ గ్రామశాఖ అధ్యక్షులు, మహిళలు కార్యకర్తలు అభిమానులు తదితరులు పాల్గొన్నారు.