ఏకగ్రీవంగా ఎన్నికైన హుజూర్నగర్ నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ నూతన కమిటీ
అధ్యక్షులు : రెవ మీసా దేవసహాయం
వర్కింగ్ ప్రెసిడెంట్ :మనోజ్ కుమార్, కరుణాకర్ రెడ్డి
ఉపాధ్యక్షులు :పోలకట్ల ధర్మయ్య
ప్రధాన కార్యదర్శి : పాతకోటి దేవదానం, రెవ. బత్తుల జ్యోయల్
సహకార్యదర్శి : జాషువా నాయక్,గోపి
కోశాధికారి : పెదపంగా ఆమోస్, సొలొమోను రాజు
హుజూర్నగర్ నియోజకవర్గ కమిటీనీ ప్రకటించిన
జిల్లా అధ్యక్షులు రెవ.డా.జి. డేవిడ్ రాజు,
జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్: బిషప్ దుర్గం ప్రభాకర్
సోమవారం 10 ఫిబ్రవరి : హుజూర్నగర్ మున్సిపాలిటీ పట్టణ జిల్లా కేంద్రం లోని జిల్లా ఉపాధ్యక్షులు రెవ. అన్నేపాక రవికాంత్ హోప్ పెంతుకోస్తు చర్చ్ నందు సూర్యాపేట జిల్లా పాస్టర్స్ పెలోషిఫ్ అధ్యక్షులు రెవ. జి. డేవిడ్ రాజు, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ బిషప్ దుర్గం ప్రభాకర్,జిల్లా కార్యదర్శి రెవ. మాతంగి పీటర్, రెవ. డా. జి ఆర్ అబ్రాహాము,గౌరవ సలహాదారులు రెవ. మేడి పౌల్,రెవ. రెమిడాల రూబెన్,బొక్క ఏలీయా రాజు,రెవ. వి. యెషయా,రెవ. జలగం జేమ్స్ రెవ ఏర్పుల క్రిస్టోఫర్,రెవ డి. జాన్ ప్రకాష్ ఆధ్వర్యంలో హుజూర్నగర్ నియోజకవర్గ పాస్టర్స్ పెలోషిఫ్ నూతన కమిటీని ఎన్నుకోవడం జరిగింది అధ్యక్షులుగా సీనియర్ పాస్టర్ రెవ. మీసా దేవసహాయం,వర్కింగ్ ప్రెసిడెంట్ మనోజ్ కుమార్, కరుణాకర్ రెడ్డి లు,ఉపాధ్యక్షులు పోలకట్ల ధర్మయ్య,ప్రధాన కార్యదర్శి పాతకోటి దేవదానం, రెవ.బత్తుల జ్యోయల్, సహయకార్యదర్శి గా జాషువా నాయక్,గోపి, కోశాధికారిగా పెదపంగా ఆమోస్, సొలొమోను రాజు లు గౌరవ సలహాదారులు పాస్టర్ శ్యామ్ సుందర్ ( రేవురు ) లు ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ మీటింగ్ లో హుజూర్నగర్ నియోజకవర్గంలోని ఏడు మండలాల దైవజనులు 100 మంది పైగా పాల్గొనీ విజయవంతం చేశారు.ఈ సందర్బంగా ఎలక్షన్ కమిటీ సభ్యులు రెవ ఉటుకూరి రాజు, తలకప్పల సుధాకర్,రెవ. కందుకూరి కృపదానం లు పాత రెండు కమిటలను రద్దు పరచి అందరి ఏకభిప్రాయంతో ఈరోజు రెండు కమిటీలను ఒకటిగా చేయడం జరిగిందని తెలిపారు. కమిటీ అధ్యక్షులు మీసా దేవసహాయం మాట్లాడుతూ నన్ను ఎన్నుకున్న పాస్టర్స్ అందరికి కృతజ్ఞతలు తెలుపుతూ క్రైస్తవుల అభివృద్ధి కొరకు అందరిని కలుపుకొని ముందుకేలతనని అన్నారు.ఈ కార్యక్రమంలో హుజూర్నగర్ మండల అధ్యక్షులు రెవ. పాపగంటి హనోక్ పీటర్, ప్రధాన కార్యదర్శి పాతకోటి జాషువా,నేరేడుచర్ల మండల అధ్యక్షులు ఆర్. దానియేలు,రెవ తలకప్పల దయాకర్, పొనుగోడు పౌల్, మీసాల జేమ్స్, ముండ్ల జాకబ్,దేవా బిక్షం తదితరులు పాల్గొన్నారు.