నక్సలైట్ ఉద్యమ నాయకుడు కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్యకు విప్లవ జోహార్లు... సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు

Apr 12, 2025 - 17:15
 0  3
నక్సలైట్ ఉద్యమ నాయకుడు కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్యకు విప్లవ జోహార్లు...  సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు

తెలంగాణ వార్త రిపోర్టర్ నక్సలైట్ ఉద్యమ నాయకుడు కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్యకు విప్లవ జోహార్లు... సిపిఐ ఎంఎల్ కమ్యూనిస్టు పార్టీ కార్యదర్శి కామ్రేడ్ క్రాంతి త్రినేత్రుడు ------------------------------------------------------------- కొండపల్లి సీతారామయ్య (1914 - 2002) భారతదేశంలోని కమ్యూనిస్టు, నక్సలైట్ ఉద్యమాలలో కీలక పాత్ర పోషించిన నాయకుడు. కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య కృష్ణా జిల్లాలోని గుడివాడ లోని జొన్నపాడులో మధ్య తరగతి రైతు కుటుంబంలో 1914 లో జన్మించాడు. యుక్తవయసులోనే కమ్యూనిస్టు భావజాలం వైపు ఆకర్షితుడై, తెలంగాణ సాయుధ పోరాటంలో చురుకైన పాత్ర పోషించారు. కామ్రేడ్ కెయస్ యువకుడుగా ఉన్నప్పుడే కమ్యూనిస్ట్ పార్టీ కార్యకలాపాల వైపు ఆకర్షితులై భూస్వామ్య వ్యతిరేక, బ్రిటిష్ వలస వ్యతిరేక ఉద్యమంలో పాలు పంచుకున్నాడు.ఆనాటి కమ్యూనిస్ట్ పార్టీ లో కృష్ణా జిల్లా కమిటీ మెంబర్ గా పని చేస్తూ తన పేరులో రెడ్డి కుల గుర్తును తొలగించుకొని సీతారామయ్యగా మారి పీడిత ప్రజలతో మమేకం ఐనాడు.కామ్రేడ్ కొండపల్లి సీతారామయ్య కృష్ణా జిల్లా కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) కార్యదర్శిగా పనిచేశారు 1964లో సీపీఐ చీలిక తర్వాత, ఆయన రాజకీయ జీవితం నుండి తాత్కాలికంగా దూరమయ్యారు. అయితే, 1970లలో నక్సల్బరీ ఉద్యమం నుండి ప్రేరణ పొంది, సిపిఎం లోని విప్లవ కారులు కామ్రేడ్ చార్ మజుందార్ నాయకత్వంలో 1969 లో సీ పీ ఐ (ఎంఎల్) పార్టీ ఏర్పడింది . కె యస్ సైతం ఈ పార్టీ లో చేరి రాష్ట్ర కమిటి నాయకుడుగా పని చేసినాడనీ... బాధితుల బంధువు భారత కమ్యూనిస్టు పార్టీ సీపీఐఎంఎల్ కార్యదర్శి ప్రజా నేస్తం అవార్డు గ్రహీత.... కామ్రేడ్ జే కే ఆర్ గారి జే ఎస్ ఆర్ సార్ ... ( జై భారత్ మహావీర్ క్రాంతి త్రినేత్రుడు ఋషి దేవాన్ష్ బోరన్న జెకెఆర్ గారి... జైశ్రీరామ్ సుభాష్ చంద్రబోస్ రెడ్ సన్ నేతాజీ రాజన్న జె ఎస్ ఆర్ సార్ ) ఫోన్ నెంబర్ 8328 277285, 98485 40078 పేర్కొన్నారు. నక్సల్ బరి ఉద్యమం పై ఆనాటి ఇందిర ప్రభుత్వం తీవ్ర అణిచివేత కొనసాగించడంతో సిపిఐ (యం యల్ )కేంద్ర నాయకత్వం కామ్రేడ్ చార్ మజుందార్ తో సహా అమరులు కావడం, అరెస్ట్ కావడం జరిగింది.కేంద్ర కమిటి దెబ్బ తిని పోయి పార్టీ శ్రేణులు చెల్లా చెదురు అయినవి.పార్టీ లో సైద్ధాంతిక గందర రాజకీయాలు పెరిగినవి. అనివార్యంగా పార్టీ శ్రేణులు ఎక్కడికక్కడ పని చేయ వలసిన తప్పనిసరి పరిస్థితి లో పదుల సంఖ్యలో సిపిఐ (యం యల్ )పేరు తోనే అనేక నక్సలైట్ గ్రూప్ లు ఏర్పడినవి. ఈ స్థితిలో కామ్రేడ్ కోండపల్లి సీతరామయ్య నాయకత్వంలో కోండపల్లి గ్రూప్ పేరుతో పిలువబడి ఆ తరువాత 1980 లో సిపిఐ యం యల్ పీపుల్స్ వార్ పార్టీ గా ఏర్పడింది. పీపుల్స్ వార్ పార్టీ 2004 లో మావోయిస్టు కమ్యూనిస్టు సెంటర్ తో ఐక్యం కావడం ద్వారా సిపిఐ మావోయిస్టు పార్టీగా ఏర్పడింది. పీపుల్స్ వార్ పార్టీ స్థాపనలో కామ్రేడ్ కె ఎస్ కీలక పాత్ర పోషించారు. పీపుల్స్ పార్టీ వివిధ రాష్ట్రాలలో ప్రజా ఉద్యమాలను సాయుధ ఉద్యమాలను కొనసాగించింది.సీతారామయ్య జీవితం తాను నమ్మిన సిద్ధాంతాలు, నక్సలైట్ ఉద్యమంలో ఆయన నాయకత్వం భారతదేశంలో ప్రభావశీలమైన చరిత్రను నిర్మించింది. 1972 లో కామ్రేడ్ చారు మజుందార్ అమరుడైన తర్వాత సుమారు రెండు దశాబ్దాలు భారత విప్లవ కమ్యూనిస్టు సైద్ధాంతిక రాజకీయ నిర్మాణ రంగంలో కె యస్ ఒక ముఖ్యమైన పాత్ర నిర్వహించాడు. కామ్రేడ్ చారు మజుందార్ అమరుడైన తర్వాత. ఉద్యమ పునర్నిర్మాణంలో పార్టీ ఎదుర్కొన్న అనేక కీలక సమస్యలను కొండపల్లి సీతారామయ్య పరిష్కరించి ఉద్యమాన్ని ఒక మలుపు తిప్పి అభివృద్ధి చేశాడు. 1970 చివరికల్లా ఆంధ్ర రాష్ట్ర కమిటీలో ప్రధాన భాగం దెబ్బతినిపోయి పార్టీ అంతర్గతంగా మితవాద అతివాద సైదాంతిక గందరగోళంతో చీలికలను ఎదుర్కొంటున్న సమయంలో కామ్రేడ్ కె యస్ నక్సల్బరీ శ్రీకాకుళ వర్గ పోరాట రాజకీయాలను ముందుకు తీసుకుపోవడంలో రాజకీయ దూరదృష్టిని ప్రదర్శించాడు. నక్సల్ బరి శ్రీకాకుళ తదితర పోరాటాలు ఒకదాని తర్వాత ఒకటి ఫాసిస్ట్ శత్రు నిర్బంధంలో అణచివేతకు గురవుతూ వేలాది మంది పార్టీ కార్యకర్తలు, నాయకులు, ప్రజలు అమరులు అవుతున్నా, ఎంతో మంది నాయకులు విప్లవ శిబిరం వదిలిపోతునప్పటికీ కామ్రేడ్ కె ఎస్ మార్క్సిజం ఆధారంగా పీపుల్స్ వార్ పార్టీ శ్రేణులను వెన్నుతట్టి పోరాటంలో నిలబెట్టాడు. విప్లవోద్యమంలో జరిగిన నష్టాలకు మూలంగా పార్టీలో తీవ్రమైన సైద్ధాంతిక రాజకీయ గందరగోళం వ్యాపించగా విప్లవ పోరాటాలలోని మంచిని, పార్టీ మౌలిక పొందాను, పోరాట సాంప్రదాయాలను కామ్రేడ్ కే ఎస్ ఎత్తి పడుతూనే పార్టీ లోపాలను స్థిరంగా సరిదిద్దడానికి తీవ్రమైన కృషి చేసినాడు విప్లవోద్యమం తాత్కాలిక వెనుకంజ గురి కావడానికి కారణమైన తప్పులను, సాధించిన విజయాలను చారిత్రకంగా విశ్లేషించి తగిన గుణపాఠాల డాక్యుమెంట్ను( సెల్ఫ్ క్రిటికల్ రిపోర్ట్ scr)కామ్రేడ్ కేఎస్ తయారుచేశాడు. ఈ సమీక్ష చెడును తిరస్కరించి పాజిటివ్ అంశాలను నిలబెట్టి ప్రజలను ప్రజాసంఘాలను సంఘటితపరచడానికి ప్రజా ఉద్యమాలు అభివృద్ధి కావడానికి గొప్ప దోహదం చేసింది. వరంగల్ కరీంనగర్ రైతాంగ ఉద్యమాలు ఆంధ్ర రాష్ట్రానికి, ఇతర రాష్ట్రాలకు విస్తరింపజేయడంలో ప్రజా పునాది కలిగిన మిలిటెంట్ పార్టీ నిర్మించడంలో కెస్ గొప్ప నిర్మాణ దక్షతను ప్రదర్శించాడు. ఉత్తర తెలంగాణ ఉద్యమాన్ని ప్రారంభించి పార్టీ మౌలిక పంథా డైరెక్షన్లో ఈ ఉద్యమానికి గెరిల్లా జోన్ పర్స్పెక్టివ్ రూపొందించి దండకారణ్య ఉద్యమానికి పునాది వేసినాడు. కమ్యూనిస్టు విప్లవం అంటే పీడిత వర్గాలతో మమేకం అవుతూ భూస్వామ్య పెట్టుబడిదారీ వర్గాలకు వ్యతిరేకంగా రాజీలేని వర్గ పోరాటాన్ని కొనసాగించే విషయంలో భారతదేశంలో కమ్యూనిస్టు నమూనా నెలకొల్పడంలో కామ్రేడ్ కొండపల్లి మార్గదర్శకాలు శ్రామిక వర్గ ప్రజలకు ఆదర్శమైనవి. దేశంలో వివిధ యం యల్ పార్టీ లలో అనేక చీలికలు నిరంతరం జరుగుతున్నప్పటికీ పీపుల్స్ వార్ పార్టీ లో చీలికలు నామమాత్రంగా ఉండి ఇతర సంస్థలు మావోయిస్టు పార్టీ గా ఐక్యం కావడంలో కె ఎస్ విప్లవకారుల ఐక్యత విషయంలో మార్గదర్శకాలు కీలకమైనవి. భారతదేశంలో కుల సమస్యను జాతుల సమస్యను ,ఇందిర ఫాసిజాన్ని , ప్రత్యేక తెలంగాణ ఉద్యమాన్ని , మితవాద అవకాశవాద రాజకీయాలకు వ్యతిరేకంగా , శత్రువుకు వ్యతిరేకంగా మిత్ర వర్గాలతో ఐక్య సంఘటన కట్టే విషయములో , పార్టీ నిర్మాణరంగంలో, ప్రజా సంఘాల నిర్మాణంలో , ప్రజా సాహిత్యం ప్రజా కలలను అభివృద్ధి చేయడంలో, గెరిల్లా జోన్స్ మిలట్రీ నిర్మాణాలు అభివృద్ధి చేయడంలో కామ్రేడ్ కొండపల్లి భారత నిర్దిష్ట పరిస్థితుల్లో మార్క్సిస్టు లెనినిస్టు దృక్పథంతో అర్థం చేసుకోని పార్టీకి అనేక సైద్ధాంతిక నిర్మాణాత్మక రచనలు చేశాడు.ఆయన రచనలు, ప్రసంగాలు క్యాడర్‌ను ఉత్తేజపరిచాయి. సీతారామయ్య రచనలు ప్రధానంగా పార్టీ డాక్యుమెంట్లు, సర్క్యులర్ల రూపంలో ఉండేవి. ఈ రచనలు సుమారు 3500 పేజీలకు పైగా ఉన్నాయి. కామ్రేడ్ కొండపల్లి రచనా పద్ధతి క్రింది స్థాయి కేడర్ కు సైతం సులభంగా అర్థమయ్యే విధంగా ఆకర్షించే విధంగా ఉంటూ పార్టీ శ్రేణులు ఎడ్యుకేట్ కావడానికి చాలా ఉపయోగపడినవి. రెండు దశాబ్దాలుగా ఆనాటి పీపుల్స్ వార్ పార్టీ నిర్మాణంలో కామ్రేడ్ కె యస్ ప్రధానపాత్ర వహించి నాడు. పీపుల్స్ వార్ పార్టీ లో తలెత్తిన కొన్ని నిర్మాణ సమస్యలు, వృద్దాప్యం, పార్కింగ్ సన్స్ వ్యాధి కారణంగా 1992 నాటికి కామ్రేడ్ కె యస్ పీపుల్స్ వార్ పార్టీకి దూరం కావడం విప్లవోద్యమంలో విషాదకర పరిణామమే. దాదాపు దశాబ్దం పైబడి అల్జీమర్స్ వ్యాధితో బాధపడి 2002 ఏప్రిల్ 12న కామ్రేడ్ కే ఎస్ తన సుదీర్ఘ విప్లవ ప్రస్థానం చాలించారు. సీపీఐ యం యల్ పీపుల్స్ వార్ పార్టీకి మొదటి నుండి వ్యవస్థాపక నాయకుడిగా సిద్ధాంతవేత్తగా రాజకీయ నిర్మాణ దక్షుడిగా కామ్రేడ్ కొండపల్లి పేరు భారత దేశ కమ్యునిస్ట్ విప్లవ ఉద్యమ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి పోతుంది.కామ్రేడ్ కె యస్ కు వినమ్రంగా విప్లవ జోహార్లు చెప్పారు కమ్యూనిస్టు పార్టీ (సిపిఐ ఎంఎల్) కార్యదర్శి... ప్రజా బంధువు అవార్డు గ్రహీత... కామ్రేడ్ జే కే ఆర్ గారి జె ఎస్ ఆర్ సార్....