రాష్ట్ర ఫోటో గ్రాఫర్ల అభ్యున్నతకి నిరంతరం కృషి రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్

తిరుమలగిరి 21 జూలై 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
రాష్ట్ర ఫోటో గ్రాఫర్ల అభ్యున్నతికి నిరంతరం కృషి చేస్తున్నామని తెలంగాణ రాష్ట్ర ఫోటో అండ్ వీడియో గ్రాఫర్ అసోసియేషన్ అధ్యక్షులు హుస్సేన్ అన్నారు. ఆదివారం తిరుమలగిరి మండల ఫోటో అండ్ వీడియో గ్రాఫర్స్ అసోసియేషన్ నూతన కార్యవర్గ ప్రమాణ స్వీకారం నిర్వహించారు. మండల అధ్యక్షులుగా సుంకరి సుధీర్, ప్రధాన కార్యదర్శి రమేష్, కార్యదర్శి సాయి, వర్కింగ్ ప్రెసిడెంట్ భాస్కర్, ఉపాధ్యక్షులు పరుశరాం, కుటుంబ భరోసా ఇంచార్జి అర్జున్, కార్యదర్శి మహేష్ లకు రాష్ట్ర అధ్యక్షులు హుస్సేన్, జిల్లా అధ్యక్షులు లాలు నియామక పత్రాలు అందజేశారు.ఈ సందర్బంగా మండల అధ్యక్షులు సుధీర్ మాట్లాడుతూ మండల ఫోటో గ్రాఫర్ లకు అండగా ఉంటానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమం లో రాష్ట్ర కోశాధికారి మాధవరెడ్డి,జనగాం జిల్లా అధ్యక్షులు రాంలక్ష్మణ్, యాదాద్రి భువనగిరి జిల్లా అధ్యక్షులు చంద్రశేఖర్, సూర్యాపేట జిల్లా కోశాధికారి బండారు లాలు, తిరుమలగిరి మండల గౌరవ సలహాదారులు కిష్టునాయక్, వర్రె గంగాధర్, సీనియర్ ఫోటో గ్రాఫర్ లు ఆలేటి నారాయణ, సురుగూరి శ్రీనివాస్, మధుకర్ రెడ్డి, నారాయణ, వివిధ మండలాల అధ్యక్షులు, ఫోటో గ్రాఫర్ లు తదితరులు పాల్గొన్నారు.....