శ్రీ తిమ్మప్ప స్వామిని దర్శించుకున్న వ్యాసరాజ మఠం పీఠాధిపతి.
జోగులాంబ గద్వాల 3 ఫిబ్రవరి 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి: మల్దకల్ ఆదిశిల క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయాన్ని వ్యాసరాజ మఠం పీఠాధిపతులు విద్యా మనోహర తీర్థ శ్రీపాదుల వారు సోమవారం సందర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు అర్చకులు స్వామీజీకి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం దేవాలయంలో స్వామీజీ పూజలు నిర్వహించారు. పీఠాధిపతులకు ఆలయ చైర్మన్ సన్మానించి తిమ్మప్ప స్వామి చిత్రపటాన్ని చరిత్ర పుస్తకం అందజేసి స్వామీజీ ఆశిస్సులు పొందారు.