యశోద హాస్పిటల్ లో కొత్త చికిత్స అందుబాటులోకి : డాక్టర్ గోపి కృష్ణ వెల్లడి.
నిజామాబాద్, 12 ఏప్రిల్ 2024 తెలంగాణవార్త జిల్లా ప్రతినిధి:- ఓపెన్ హార్ట్ అవసరం లేకుండా ఐవిఎల్ కొత్త పద్ధతి ద్వారా ఐవియుఎస్ సహకారంతో నిజామాబాద్ కు చెందిన పేషెంట్ కు అరుదైన చికిత్స అందించామని యశోద హాస్పిటల్ డాక్టర్:గోపి కృష్ణ అన్నారు. శుక్రవారం నగరంలోని ప్రెస్ క్లబ్ లో మీడియా సమావేశం ఏర్పాటు చేసి మాట్లాడుతూ.. నేను నిజామాబాద్ లో గుండె వైద్య నిపుణులుగా ఎన్నో సేవలు అందించామని,ప్రస్తుతం హైదరాబాద్ లోని యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ సేవలు అందించడం జరుగుతుందని అన్నారు.
నిజామాబాద్ జిల్లా కమ్మర్ పల్లి మండలం, దమ్మన్నపేట్,అమీర్ నగర్ గ్రామానికి చెందిన గుగులావత్ నందు వయస్సు (49) అనే పేషెంట్ కు గత 10 సంవత్సరాల క్రిందట గుండెలో కవాటాలు మూసుకొనిపోగ, హైదరాబాద్ లో బైపాస్ ఆపరేషన్ చేసి మైట్రల్ వాల్ ను అమర్చారని, ప్రస్తుతం మరల నందు అనే పేషెంట్ కు చాతి నొప్పి, ఆయసం,గుండెదడ కలగడం వలన తిరిగి వైద్యులను సంప్రదించగా,గుండెలో ఇంతకుముందు అమర్చిన గ్రాఫ్ట్ లు మూసుకుపోవడం ప్రధాన గుండె రక్తనాళం కూడ మూసుకుపోయినట్లు గుర్తించారని, చాలా మంది డాక్టర్లను సంప్రదించినా మళ్ళీ ఓపెన్ హార్ట్ ఆపరేషన్ అవసరం అని చెప్పగా,నందు పేషెంట్ యశోద హాస్పిటల్ హైటెక్ సిటీ ని నందు సంప్రదించారని, అక్కడ సేవకు అందిస్తున్న నన్ను సంప్రదించగా అతనికి యశోద హాస్పిటల్ హైటెక్ సిటి బ్రాంచీలో ఓపెన్ హార్ట్ ఆపరేషన్ అవసరం లేకుండా ఎల్ఏంసిఏ స్టంట్ ను ఐవిఎల్, ఐవియుఎస్ సహాకారంతో అమర్చామని అన్నారు. ఈ మీడియా సమావేశంలో సిబ్బంది రాజీ రెడ్డి,మధు పాల్గొన్నారు.