కార్యకర్తల బలం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది

ఎంపీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి

Apr 12, 2024 - 20:04
 0  27
కార్యకర్తల బలం వల్ల కాంగ్రెస్ పార్టీ అధికార పగ్గాలు చేపట్టింది

కుత్బుల్లాపూర్  తెలంగాణవార్త, ఏప్రిల్ 11 : కార్యకర్తల బలం వల్ల పార్టీ ఈరోజు ఈ విధంగా ప్రతిష్టంగా ఉండి అధికారంలోకి వచ్చిందని, అదే విధంగా జరగనున్న పార్లమెంట్ ఎన్నికల్లో తనను అత్యధిక మెజారిటీ అందించి గెలిపించేందుకు కార్యకర్తలు అంతా సమిష్టిగా కృషి చేయాలని మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్స్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి కోరారు. 

 బుధవారం పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా కుత్బుల్లాపూర్ నియోజకవర్గం  130 డివిజన్ సూరారం కాలనీలోని రాజీవ్ గృహకల్ప, 60 గజాల నుండి తెలుగు తల్లి నగర్ సాయిబాబా నగర్ వరకు మల్కాజిగిరి పార్లమెంట్ కాంగ్రెస్స్ పార్టీ అభ్యర్థి పట్నం సునీత మహేందర్ రెడ్డి పాదయాత్ర నిర్వహించారు. ఈ సందర్భంగా సునీత మాట్లాడుతూ రానున్న పార్లమెంటు ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ప్రజలను కోరారు.

 కాంగ్రెస్స్ పార్టీ ఆరు గ్యారంటిలతో పేద ప్రజలకు ఎంతో మేలు జరుగుతుందని, కాంగ్రెస్స్ పార్టీని అత్యధిక స్థానాలలో గెలిపించాలని విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ ఇంచార్జి కోలన్ హన్మంతు రెడ్డీ, టీపీసీసీ ప్రధాన కార్యదర్శులు భూపతి రెడ్డీ  జోస్నా శివారెడ్డి, జిల్లా మహిళా అధ్యక్షురాలు ఆర్ లక్ష్మి, బొంగునూరి ప్రభాకర్ రెడ్డి, బొంగోనూరి శ్రీనివాస్ రెడ్డి, బండి శామ్ గౌడ్, ఎంఎంసీ సీనియర్ నాయకుడు కోలన్ శ్రీనివాస్ రెడ్డి, ఎంఎంసీ అధ్యక్షులు కోలన్ రాజ శేఖర్ రెడ్డి, ఉపాధ్యక్షురాలు అంజలి, ప్రధాన కార్యదర్శి రఫీయ  బేగం, డివిజన్ అధ్యక్షులు, మహిళా అధ్యక్షురాలు, ఏ,బీ బ్లాక్ అధ్యక్షులు, డీసీసీ ఉపాధ్యక్షులు శ్రవణ్ కుమార్ అవిజే జేమ్స్, నియోజకవర్గ ముఖ్య కార్యకర్తలు, సీనియర్ కాంగ్రెస్ నాయకులు, డివిజన్ అధ్యక్షులు, మహిళ కాంగ్రెస్ నాయకులు, మైనారిటీ నాయకులు, ఎన్ఎస్యుఐ  నాయకులు, ఐఎన్టియుసి  నాయకులు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333