గ్రామీణ రహదారులకు మహర్దశ

Mar 8, 2024 - 19:08
 0  1
 గ్రామీణ రహదారులకు మహర్దశ
 గ్రామీణ రహదారులకు మహర్దశ

నియోజకవర్గ సమగ్రాభివృద్దే లక్ష్యంగా ప్రణాళికలు
రాష్ట్రంలోనే కొత్తగూడెం నియోజకవర్గానికి ప్రత్యేక స్తానం
కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు
లక్ష్మీదేవిపల్లి ఏజెన్సీ గ్రామాల్లో రోడ్డుపనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే

లక్ష్మీదేవిపల్లి : కొత్తగూడెం నియోజకవర్గంలోని గ్రామీణ రహదారులకు మహర్దశ రాబోతోందని, వివిధ పథకాలతో నియోజకవర్గ వ్యాప్తంగా రహదారుల నిర్మాణాలు వేగవంతంగా జరుగుతున్నాయని కొత్తగూడెం శాసనసభ సభ్యులు కూనంనేని సాంబశివరావు అన్నారు. మండలపరిధిలోని రేగళ్ల, మైలారం, బంగారుచెలక, చంద్రలగూడెం తదితర గ్రామాల్లో రోడ్లు, డ్రైనేజీ నిర్మాణపనులు గురువారం ఎమ్మెల్యే శంకుస్థాపన చేసి ప్రారంభించారు. ఈ సందర్బంగా ఏర్పాటైన శంకుస్థాపన సభల్లో కూనంనేని మాట్లాడారు. ప్రజలకు మౌలిక వసతులు, పెండింగ్ సమస్యల పరిస్కారమే అజెండాగా ప్రణాళికాబద్ధంగా ముందుకు సాగుతున్నామన్నారు. ఎన్నికల ప్రచారంలో ప్రజలనుంచి వచ్చిన విజ్ఞప్తుల మేరకు ఎన్ఆర్ఈజిఎస్, డిఎంఎఫ్, సిఆర్ఆర్ తదితర పథకాలక్రింద రోడ్లు, డ్రైనేజీల నిర్మాణాలకు నిధులు మంజూరు చేయించి పనులు చేపడుతున్నామని తెలిపారు. నియోజకవర్గంలోని పాల్వంచ, లక్ష్మీదేవిపల్లి, చుందుపల్లి, సుజాతనగర్ మండలాల పరిధిలో ఇప్పటికే సుమారు రూ. 4కోట్లకు పైగా నిధులతో పనులు జరుగుతున్నాయని తెలిపారు. పనులు నాణ్యతాప్రమాణాలతో జరిగేలా అధికారులు, ప్రజలు పర్యవేక్షించుకొవాలని సూచించారు. కార్యక్రమాల్లో కొత్తగూడెం మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్, సిపిఐ జిల్లా కార్యదర్శి ఎస్ కే సాబీర్ పాషా,   లక్ష్మీదేవిపల్లి ఎంపీపీ బుక్యా సోనా, తాసిల్దార్ వరప్రసాద్, పంచాయతిరాజ్ ఏఈ  రామకృష్ణ,  స్పెషల్ ఆఫీసర్ వెంకటస్వామి, ఎంపిటిసి నునవత్, గోవింద్,  చలిగంటి శ్రీనివాస్, వార్డు కౌన్సిలర్లు కంచర్ల జమ్మలయ్య, భూక్యా శ్రీనివాస్, స్థానిక నాయకులు దీటి లక్ష్మీపతి, కంటెం సత్యనారాయణ, శేఖర్, పరుపర్తి రాజు, దారా శ్రీనివాస్, కొమరం లలిత, రాజబాబు,   రాంబాబు,  గ్రామ ప్రజలు పాల్గొన్నారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333