గోమాతకు ఆశ్రమం కల్పించిన విశ్వహిందూ పరిషత్ సభ్యులు

భద్రాచలం పట్టణంలోని ఈరోజు ఉదయం గోల్లగట్ట రోడ్డులోని వెంకటేశ్వర కాలనీ నందు ఒక ఆవు చిన్న గోమాతకు జన్మనిచ్చింది,ఈ విషయం ఆ వీధిలో ఉంటున్న లాయర్ సోముల గిరిప్రసాద్ సంఘ సేవకుడు కడాలి నాగరాజుకి చరవాణి ద్వారా తెలిపినారు, ఈ విషయం తెలుసుకున్న నాగరాజు హుటాహుటిన విశ్వహిందూ పరిషత్ సభ్యులైనటువంటి అజయ్ బాబా, గణేష్, మణికంఠ, సాయి, లాయర్ తిరుమలరావు తదితరులకు చరవాణి ద్వారా తెలియజేసినాడు, అదే కాలనీలో ఉంటున్న చిన్నారులు శ్లోక, దేవాన్ష్, అఖిల్, ఆ గోమాత వద్ద నాగరాజు మరియు విశ్వహిందూ పరిషత్ సభ్యులు వచ్చేవరకు ఆ గోమాతకు అప్పుడే పుట్టినటువంటి చిన్ని గోమాతకు కర్రలు పట్టుకొని రక్షణగా నిలుచున్నారు, వారు వచ్చిన తర్వాత నాగరాజు మరియు విశ్వహిందూ పరిషత్ సభ్యులు ట్రాలీ ఆటోని మాట్లాడుకొని నాలుగు గంటల పాటు శ్రమించి కాకరాల శర్మ వారి అబ్బాయి తేజతో చర్వాణితో మాట్లాడి పురుషోత్తపట్నంలో ఉన్నటువంటి వారి గోసాలకు ఆ గోమాతను చిన్ని గోమాతను తరలించినారు, మార్గం మధ్యలో ఎన్నోసార్లు ఆ గోమాత వీరందరినీ చాలా ఇబ్బందులు పాలు చేసినది రోడ్డు పొడవునా జనాలను ఆ గోమాత భయభ్రాంతులకు గురిచేసింది, అయినా ఇబ్బందులు అన్నిటిని తట్టుకొని ఆ గోమాతను ఆ చిన్ని గోమాతను గోసాలకు తరలించినారు, ఈ యొక్క కార్యక్రమంలో కడాలి నాగరాజు, అజయ్ బాబా, గణేష్, మణికంఠ, సాయి, తిరుమల రావు, తదితరులు పాల్గొన్నారు.