మృతుల కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

Sep 8, 2024 - 21:13
Sep 8, 2024 - 21:30
 0  14
మృతుల కుటుంబాలకు అండగా కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటాం

వివిధ కుటుంబాలను పరామర్శించిన యువనేత శ్రీ ధనసరి సూర్య 

మంగపేట తెలంగాణవార్త సెప్టెంబర్ 8:- మంగపేట మండలo లోని పాలయిగూడెం గ్రామానికి చెందిన  చుక్కుల రమణమ్మ గారు అనారోగ్యం తో మృతి చెందాగా వారి కుటుంబానికి  అండగా నిలిచి .... వారి దశ దిన కర్మకు 5000/- రూపాయలు ఆర్ధిక సహాయంగా చేసిన రాష్ట్ర పంచాయతీ రాజ్, గ్రామీణ అభివృద్ధి & స్త్రీ శిశు సంక్షేమ శాఖ మాత్యులు గౌరవనీయులు శ్రీమతి ధనసరి అనసూయ సీతక్క  కుమారుడు యువ నాయకుడు రాష్ట్ర యువజన కాంగ్రెస్ సెక్రటరీ ధనసరి సూర్య .

అదేవిధంగా రాజుపేట గ్రామానికి చెందిన మండల సీనియర్ నాయకులు బోనుగు హనుమంతరావు గారి అన్న  మాజీ సర్పంచ్ బోనుగు సాయన్న ఇటీవల అనారోగ్యం తో వరంగల్ లోని హాస్పిటల్ లో చికిత్స పొందుతు మృతి చెందగా వారి నివాసం వద్దకు వెళ్లి అయన చిత్ర పటానికి పూల మాల వేసి నివాళ్లు అర్పించి వారి కుటుంబాన్ని పరామర్శించారు ....

అదేవిధంగా మండలం లోని నిమ్మగూడెం గ్రామ పంచాయతీ పరిధిలోని (చింతగుంట) గ్రామానికి చెందిన కొమురం జగన్ నర్సంపేట సి ఐ గారి గాన్మెన్ గుండెపోటుతో మరణించగా మృతుని కుటుంబాన్ని పరామర్శించి మృతునికి నివాళి అర్పించారు అదే గ్రామనికి చెందిన బండ్ల ముత్యపు రావు గారి దశదినం కర్మలకు హాజరై వారి చిత్రపటానికి పూలమాల వేసి వారి కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు.

ఈ కార్యక్రమం లో.. మండల అధ్యక్షులు మైల జయరామ్ రెడ్డి, జిల్లా ప్రచార కమిటీ చైర్మన్ పూజారి సురేందర్ బాబు, జిల్లా యూత్ కాంగ్రెస్ అధ్యక్ష అభ్యర్థి ఇస్సార్ ఖాన్, జిల్లా ప్రచార కార్యదర్శి కోడం బాలకృష్ణ,జిల్లా సోషల్ మీడియా కోఆర్డినేటర్ కర్రీ నాగేంద్రబాబు,జిల్లా అధికార ప్రతినిధి అయ్యోరి యణయ్య, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కటబోయిన నర్సింహారావ్, బ్లాక్ కార్యదర్శి తుమ్మూరి రాంరెడ్డి, మండల వర్కింగ్ కమిటీ అధ్యక్షులు  చెట్టుపల్లి వెంకటేశ్వర్లు, బీసీ సెల్ మండల అధ్యక్షులు ముత్తినేని ఆదినారాయణ, ఎస్సి సెల్ మండల  అధ్యక్షులు పళ్ళికొండ యాదగిరి, యూత్ కాంగ్రెస్ మండల అధ్యక్షులు మురుకుట్ల నరేందర్, మేడారం ట్రస్ట్ బోర్డు డైరెక్టర్ రాజారత్నం, బీసీ సెల్ ఉపాధ్యక్షులు వీర్ల జయకృష్ణ, గ్రామ అధ్యక్షులు పొట్రూ సమ్మయ్య , కొత్త రాంబాబు, సీనియర్ నాయకులు... ఎర్రంగారి సురేష్, చందర్లపాటి శ్రీను, తుమ్మల ముఖర్జీ, కాకర్ల శ్రీను,చదలవడా శ్రీను, ఎడ్ల నరేష్, మద్దెల ప్రవీణ్, lp కిరణ్,కర్రీ ప్రేమ్ కుమార్,మీరాజ్, శ్రీకాంత్, తదితరులు పాల్గొన్నారు....

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్