ఐటిడిఎ డిప్యుటీ డిఎం ఎచ్ఓ వైద్య శిబిరం సందర్శన
ఐటిడిఎ డిప్యుటీ డిఎం ఎచ్ఓ వైద్య శిబిరం సందర్శన
వాజేడు జూన్ 21 తెలంగాణ వార్త ప్రతినిధి
వాజేడు మండలలోని వాజేడు ప్రాధమిక ఆరోగ్య కేంద్రం పరిధిలోనీ దులాపురం గ్రామపంచాయతీలో మలేరియా నిర్ధారణ పరీక్షలు ఇంటింటికి తిరిగి గ్రామపంచాయతీ సెక్రెటరీ, సిబ్బంది సహకారంతో హౌస్ టు హౌస్ సర్వే వైద్యాధికారి ఆధ్వర్యంలో వైద్య శిబిరం నిర్వహిస్తు,ఫ్రైడే డ్రై డే కార్యక్రమాన్ని నిర్వహించాము. ఈ కార్యక్రమానికి ఏటూరునాగారం ఐటిడిఏ డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ఓ కోరం క్రాంతి కుమార్ సందర్శించడం జరిగింది.క్రాంతికుమార్ మాట్లాడుతూ వైద్య సిబ్బందికి,జిపి సిబ్బందికి వారానికి రెండుసార్లు శుక్రవారం, మంగళవారం రోజున ఫ్రైడే కార్యక్రమం నిర్వహించాలని,నీళ్ల ట్యాంకు వారంనికి ఒక్కసారి శుభ్రం చేయాలని వ్యాధుల పట్ల అప్రమత్తంగా ఉండాలని ఇంటి చుట్టు పరిసరలు పరిశుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు అవగాహన కల్పించడం జరిగింది.ఈ కార్యక్రమంలో డిప్యూటీ డిఎమ్ అండ్ హెచ్ ఓ కోరం క్రాంతి కుమార్, వాజేడు వైద్యాధికారి
కొమరం మహేంద్ర,సబ్ యూనిటీ అధికారి వాసం నరసింహారావు,హెల్త్ సూపర్వైజర్ ఖలీల్,హెల్త్ అసిస్టెంట్ శేఖర్, గ్రామపంచాయతీ సెక్రటరీ శిరీష,గ్రామ సిబ్బంది, ఆశా కార్యకర్త గ్రామస్తులు పాల్గొనడం జరిగింది.