గిరిజనుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

Jun 18, 2024 - 20:06
 0  12
గిరిజనుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి

గిరిజనుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి 

 రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క .

*ములుగు జిల్లా అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలి*

*అధికారులు నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవు*

*త్వరలోనే ఐటిడిఏ పాలక మండలి సమావేశం*

ములుగు :- తెలంగాణ వార్త స్టాప్ రిపోర్టర్

గిరిజనుల సమస్యలను త్వరిత గతిన పరిష్కరించాలని, ములుగు జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి సాధించాలని , అధికారులు నిర్లక్ష్యం వహిస్తే శాఖ పరమైన చర్యలు తప్పవని ,త్వరలోనే ఐటిడిఏ పాలక మండలి సమావేశం ఏర్పాటు చేసి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క తెలిపారు.

మంగళవారం ఏటూరు నాగారం ఐటీడీఏ కార్యాలయం లో 

ఐటీడీఏ కార్యాచరణ ప్రణాళిక సమీక్ష సమావేశాన్ని రాష్ట్ర పంచాయితీ రాజ్ గ్రామీణాభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రి దనసరి అనసూయ సీతక్క. , జిల్లా కలెక్టర్ దివాకర టిఎస్, ఐటిడిఏ ప్రాజెక్ట్ ఆఫీసర్ చిత్రా మిశ్రా , అదనపు కలెక్టర్ స్థానిక సంస్థలు పి.శ్రీజ, జిల్లా అటవీ శాఖ అధికారి రాహుల్ కిషన్ యాదవ్, ఏటూరు నాగారం ఏఎస్పీ మహేష్ బి.గితే లతో కలిసి నిర్వహించారు.

ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గిరిజన సమస్యలను పరిష్కరించడం కోసమే ప్రభుత్వం ఐటీడీఏ కార్యాలయాలను ఏర్పాటు చేసిందని త్వరలోనే ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉన్న పాలకమండలి సమావేశాన్ని ఏర్పాటు చేసి గిరిజనుల సమస్యలను పరిష్కరించడం కోసం కృషి చేయడం జరుగుతుందని తెలిపారు. ఆరు నెలలుగా పెండిగ్ లో ఉన్నా అభివృద్ధి పనులను పూర్తి స్థాయిలో ప్రారంభించాలని పనులు అత్యంత నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ పూర్తి చేయాలని అన్నారు.

ఐటీడీఏ ఆధ్వర్యంలో నడిచే పాఠశాలలు వసతి గృహాలలో విద్యార్దులకు నాణ్యమైన పౌష్టిక ఆహారం అందించాలని , వసతి గృహాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉండాలని , కలుషిత ఆహారం తినడం వల్ల విద్యార్దులు ఇబ్బందులు ఎదుర్కున్నారు అనే వార్తలు రాకూడదని ఐటీడీఏ పాఠశాలలో మెరుగైన మార్పులు రావాలని సంబంధిత అధికారులను ఆదేశించారు.

గిరిజనుల ఆరోగ్యం పట్ల వైద్య శాఖ అప్రమత్తంగా ఉండాలని గుత్తి కోయా ప్రాంతాలలో ప్రత్యేకంగా హెల్త్ క్యాంపులు నిర్వహించాలని వరదల సమయంలో గర్భిణీ స్త్రీలపై ప్రత్యేక దృష్టి పెట్టి ఆసుపత్రులకు తరలించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆశ అంగన్వాడీల సమన్వయంతో పనిచేస్తూ గ్రామాలలో వైద్య సదుపాయాలు కల్పించాలని గిరిజనులకు ఆరోగ్యం పై ప్రత్యేక కార్యక్రమాలు ఏర్పాటు చేసి అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 

ఇప్పపువ్వు చెట్ల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని తద్వారా గిరిజనులకు ఉపాధి లభించడంతోపాటు అడవి పచ్చదనంగా మారుతుందని ఇప్పపువ్వు , గింజల సేకరణ ద్వారా గిరిజనులకు ఉపాధి లభ్యం అవుతుంది కాబట్టి వాటి పెంపకంపై అధికారులు దృష్టి పెట్టాలని అన్నారు. 

ఏజెన్సీ ప్రాంతంలో మాదక ద్రవ్యాలు డ్రగ్స్ మత్తు పదార్థాలు వంటి వాటిపై ప్రత్యేక ఫోకస్ పెట్టాలని సరిహద్దు దగ్గరగా ఉన్న నేపథ్యంలో జిల్లాలోకి మాదకద్రవ్యాలు వచ్చే అవకాశం ఉన్నందున సరిహద్దు ప్రాంతాలలో గట్టి నిఘా వ్యవస్థను ఏర్పాటు చేయాలని పోలీస్ అధికారులను ఆదేశించారు.

స్థానిక గిరిజన యువతకు స్వయం ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా ప్రణాళికలు సిద్ధం చేయాలని మారుమూల ప్రాంతాలలో ఉండే గుత్తి కోయ గ్రామాలకు రేషన్ బియ్యం పంపిణీలో ఇబ్బందులు ఎదురైతే స్థానికంగా స్టాక్ రూమ్స్ ఏర్పాటు చేసుకోవాలని , మహిళలు స్వయం ఉపాధి కుటీర పరిశ్రమలను నెలకొల్పే అంశంలో బ్యాంకు లింకేజీ రుణాలు పొందడంపై అవగాహన కల్పించాలని పేర్కొన్నారు. 

ఐటీడీఏ ఇంజనీరింగ్ ఆధ్వర్యంలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులను నాణ్యత ప్రమాణాలు పాటిస్తూ త్వరితగతిన పూర్తి చేయాలని వరద ముంపు ప్రాంతాలలో ఫ్లెడ్ బ్యాంకులు ఏర్పాటు చేయాలని గిరిజన ప్రాంతాలలో నిరంతరం విద్యుత్ సేవలు అందే విధంగా చూడాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. 

ప్రజలకు అధికారులు నిరంతరం అందుబాటులో ఉండాలని గ్రామాలలో క్షేత్రస్థాయిలో పరిశీలిస్తూ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని ప్రజల నుంచి వచ్చిన సమస్యల దరఖాస్తులను నిర్లక్ష్యం వహించకుండా జవాబుదారితనంగా వాటి సాధ్యాలను వెంటనే వారికి వివరించాలని తెలిపారు.

ఈ కార్యక్రమంలో ఆర్డిఓ సత్యపాల్ రెడ్డి, ఐటీడీఏ ఏపీవో వసంతరావు, ఐటీడీఏ డిడి పోచాం, డి ఎం హెచ్ ఓ డాక్టర్ అప్పయ్య, డాక్టర్ క్రాంతి కుమార్ , ఓ రాజ్ కుమార్, జిసిసి జనరల్ మేనేజర్ ప్రతాప్ రెడ్డి, డి డబ్ల్యు ఓ స్వర్ణలత లెనిన , ఐటీడీఏ ఇంజనీరింగ్, ఇరిగేషన్ అధికారులు తదితరులు పాల్గొన్నారు.