గణేష్ నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలి ఎస్సై డి.నాగరాజు
అడ్డగూడూరు 5 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:-
యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలోని వివిధ గ్రామాల గణేష్ ఉత్సవాల కమిటీల సభ్యులకు ముఖ్య గమనిక నవరాత్రి ఉత్సవాలు భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఎస్సై నాగరాజు తెలిపారు1.ప్రతి విగ్రహనికి పోలీస్ వారి నుండి తప్పనిసరిగా పర్మిషన్ తీసుకొని ఉండాలి2. మండపం రోడ్ కి అడ్డంగా పెట్టి ప్రయాణికులకు ఇబ్బంది కలిగించొద్దునీ 3.మండపానికి కరెంట్ మరియు ల్యాండ్ ఓనర్ అనుమతులు ఉండాలి 4. మండపం వద్ద షాట్ సార్క్యూట్ కాకుండా చూసుకోవాలి, అతుకులు ఉండి,ఇన్సూలేషన్ కట్ అయి ఉన్న కరెంటు వైర్లు ఉపయోగించకూడదు.
5.మండపం వద్ద నీళ్ల డ్రమ్ము నిండా నీరు మరియు సంచులలో ఇసుక నింపి పెట్టాలి.6.మండపం వద్ద స్పీకర్లు ఉదయం 05.30 గంటల నుండి రాత్రి 10.00 గంటల వరకు మాత్రమే పెట్టాలి,సౌండ్ తక్కువగా పెట్టాలి. సౌండ్ ఇతరులు బందులు కాకుండా విదంగా ఉండకూడదు7
.పండగ వల్ల మీ మీ ఇళ్లల్లో సంతోషం ఉండాలి,కానీ విషాదం ఏర్పడే విదంగా ఉండరాదు. పండగ అంటే సంతోషం కదా అని ఇతరులను ఇబ్బంది పెట్టి మీరు సంతోష పాడరాదు 8.ప్రతి మండపం వద్ద రాత్రి పగలు కాపలా ఉండేలా నిర్వాహకులు చూసుకోవాలి,అలా వీలు అయితేనే విగ్రహాలు పెట్టండి9.మద్యం సేవించి మండపంలొ ఉండకూడదు,రాత్రి వేళల్లో,తాగుకుంటూ మరియు పేకాట ఆడుకుంటూ ఉంటే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోబడును10.మండపం వద్ద ఏదైనా సంఘటన జరిగినట్లయితే సంబంధిత శాఖలకు సమాచారం అందించాలి11.పండగ రోజుల్లో తాగి గొడవలు పడకూడదు,అలా గొడవల వల్ల మీ కుంటుంబం ఇబ్బందుల పాలు అవుతుంది.
12.ముఖ్యంగా రాజకీయాలకు సంబంధించిన ప్రసంగాలు చేసిన కానీ,రాజకీయ పాటలు పెట్టినా కానీ అట్టి మండపం నిర్వాహకులపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకోబడును.
13.నిమజ్జనం రోజు రాత్రి వరకు ఉండకుండా తొందరగా తగు జాగ్రత్తలు తీసుకొని నిమజ్జనం చేయాలి!డీజేలు పెట్టినట్లయితే అట్టి డీజేలను సీజ్ చేసి కేసు నమోదు చేయబడునని అడ్డగూడూరుఎస్ఐ నాగరాజు తెలిపారు.