పోలీస్ ప్రజాభారోసా అవగాహన కార్యక్రమం_
సూర్యాపేట పట్టణం ప్రభుత్వ జూనియర్ కళాశాల నందు విద్యార్థులకు
- ప్రతి విద్యార్థికి మంచి ఆశయం, లక్ష్యం ఉండాలి.
- ప్రావీణ్యం ఉన్న అంశం పై సాధన చేయాలి.
- చెడు అలవాట్లకు, చెడు వ్యక్తులకు దూరంగా ఉండాలి.
- డ్రగ్స్, సైబర్ మోసాల నివారణలో ఇతరులకు అవగాహన కల్పించాలి.
- తల్లిదండ్రుల కష్టం చాలా విలువైనది.
కె.నరసింహ ఐపిఎస్, ఎస్పి సూర్యాపేట జిల్లా.
పోలీస్ ప్రజా భరోసా కార్యక్రమం లో భాగంగా ఈరోజు సూర్యాపేట పట్టణం నందు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో పోలీస్ ప్రజాభరోసా అవగాహన కార్యక్రమం నిర్వహించడం జరిగినది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ నరసింహ ఐపిఎస్ గారు ముఖ్య అతిథిగా హాజరై శాంతి భద్రతలు, చట్టాలు, మంచి ప్రవర్తన, విద్యార్థి ఉన్నత లక్ష్యాలు, పట్టుదలతో కృషి చేయడం, విజయాలు అమశాల గురించి అవగాహన కలిగించారు. ఈ సందర్భంగా కోదాడ ఎస్పీ గారు మాట్లాడుతూ భారతదేశ మాజీ రాష్ట్రపతి అబ్దుల్ కలాం గారి జయంతి పురష్కరించుకుని ఆయన జీవితం గురించి కలాం గారు సాధించిన విజయాలు, అతను దేశానికి చేసిన సేవ, కృషి గురించి విద్యార్థులకు వివరించారు. ప్రతి విద్యార్థి ఉన్నత ఆశయాలను కలిగి ఉండాలని అబ్దుల్ కాలం గారిని స్ఫూర్తిగా తీసుకోవాలని ఆశయ సాధన కోసం కృషి చేస్తేనే విజయాలు వస్తాయని తెలిపారు. పాఠశాలలో మనం ఎందుకు ఉన్నాము అనేది గుర్తుంచుకోవాలి, చదువు చాలా విలువైనది ప్రపంచంలో చదువుతోనే విజ్ఞానం వెలుగోందుతుంది అన్నారు. మనకు విజ్ఞానాన్ని, తెలివిని, మంచి నడవడికను విద్యాలయాలు నేర్పిస్తాయి, విద్యార్థికి తరగతి గది ఒక ప్రయోగశాల అన్నారు. బాగా చదివి ప్రయోజకులు కావాలి, సదుపాయాలను సద్వినియోగం చేసుకుని లక్ష్యం కోసం నిరంతరం కృషి చేయాలని అన్నారు. అవకాశాలు లేని రోజుల్లో మంచి విజయాలు సాదించిన గొప్పవాళ్ళు ఉన్నానుఅలాంటి వారి విజయగధాలను ఆదర్శంగా తీసుకోవాలి అని అన్నారు. బాలికలు కష్టపడి చదివి ఉన్నతస్థాయికి చేరాలని అన్నారు, సమాజంలో ఎన్నో రుగ్మతలు ఉన్నాయి వాటి నిర్మూలనకు చదువు మార్గం అన్నారు. ప్రావీణ్యం ఉన్న అంశంలో కృషి చేయాలి, ఆటలు ఆడాలి, శారీరకంగా దృఢంగా ఉండాలి అని కోరారు. భేటీ బచావో - భేటీ పడావో నినాదంతో బాలికల అభ్యున్నతికి ప్రభుత్వాలు కృషి చేస్తున్నాయి, బాలికలను ఎదగనివ్వాలి అని కోరారు. బాల్య వివాహాలు చేయవద్దు అని కోరారు. విద్యార్థులు చిన్నచిన్న సమస్యలకు ఒత్తిడికి లోనై, ఆకర్షణలకు లోనై బంగారు జీవితాన్ని భవిష్యత్తుని నాశనం చేసుకోవద్దు ఆత్మహత్య లాంటివి చేసుకోవద్దు అని కోరారు. చెడు అలవాట్లకు లోను కావద్దు మంచి పుస్తకాలను మంచి స్నేహితులను ఏర్పాటు చేసుకోవాలి, కష్టపడి చదివి తల్లిదండ్రులకు చదువు చెప్పిన గురువులకు పాఠశాలకు మంచి పేరు తేవాలని కోరారు. ఏ రకంగా నైనా వేధింపులు జరుగుతున్న తెలిసినవాళ్లు బంధువులు ఎవరైనా చెడు బుద్ధితో శరీరాన్ని తాకుతున్నట్లు గ్రహించిన వెంటనే తల్లిదండ్రులకు లేదా గురువులకు తెలియజేయాలి, ధైర్యంగా పోలీసులకు ఫిర్యాదు చేయాలి అని అన్నారు. ప్రస్తుత సమాజంలో సైబర్ మోసాలు మాదకద్రవ్యాలు అతిపెద్ద సమస్యగా ఉన్నాయని వీటిపై విద్యార్థులు ఫ్రంట్ వారియర్స్ లాగా పనిచేసే పెద్దలకు అవగాహన కల్పించాలని సూచించారు. సామాజిక మాధ్యమాలలో వచ్చే వాటికి ప్రభావితం కావొద్దు అని ఇంటర్నెట్ నుంచి జ్ఞాన సముపార్జనకు సద్వినియోగం చేసుకోవాలని కోరారు.
ఈ కార్యక్రమం నందు సూర్యాపేట పట్టణ CI వెంకటయ్య, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ రామారావు, SI లు, కళాశాల ఉపాధ్యాయులు పాల్గొన్నారు,