మృతుని కుటుంబానికి ఎస్ ఎస్ సి బ్యాచ్ (2009) ఆర్థిక సహాయం

అడ్డగూడూరు 05 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూర్ మండలంలోని లక్ష్మి దేవి కాల్వ గ్రామాని చెందిన పర్రెపాటి సైదులు- లక్ష్మి వారికుమారుడు పర్రెపాటి వెంకటేష్ అనే వ్యక్తి ఇటీవల ప్రమాదవశాత్తు మరణించగా బాధిత కుటుంబాన్ని పరామర్శించిన చిగుళ్ల మహేష్,పనుమటి సతీష్,పనుమటి నరేష్,హాజరై మృతుని చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబ సభ్యులను పరామర్శించి ప్రగాఢ సానుభూతి తెలిపారు.మృతుని కుటుంబ సభ్యులకు తోటి స్నేహితులు లక్ష్మీదేవి కాల్వ గ్రామానికి చెందిన 2009 ఎస్ ఎస్ సి బ్యాచ్ వారు ఆర్థిక సహాయంగా రూ.11వేలు నగదును గురువారం అందించి మీ కుటుంబానికి మేమున్నామన్న భరోసా కల్పించారు.ఈ కార్యక్రమంలో చిగుళ్ళ మహేష్,బండి రమేష్,ఆకుల భిక్షం,గుంజ గణేష్,ఆకుల హరీష్ ,పనుమటి సతీష్ ,పనుమటి నరేష్ ,పొడిచేడు సుమన్,బొమ్మగానీ సతీష్,బండి మహేష్,పనుమటి చంటీ,బండి శ్రవణ్,చెట్టిపల్లి ప్రవీణ్,కప్పల మహేష్ తదితరులు పాల్గొన్నారు.