బహుజన రాజ్యాధికార స్ఫూర్తి ప్రదాత మహాత్మ జ్యోతిరావు పూలే

తిరుమలగిరి 19 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
తిరుమలగిరి మండల కేంద్రంలో పూలే అంబేద్కర్ చౌరస్తాలో ఏర్పాటుచేసిన మహాత్మ జ్యోతిరావు పూలే విగ్రహ ఆవిష్కరణ సామాజిక తెలంగాణ మహాసభ రాష్ట్ర కన్వీనర్, ఉమ్మడి నల్గొండ జిల్లా ఉద్యమాల ఉపాధ్యాయులు కొత్తగట్టు మల్లన్న చేత ఘనంగా ఆవిష్కరించడం జరిగింది. విగ్రహావిష్కరణ తర్వాత ఆయన మాట్లాడుతూ బీసీ ఎస్సీ ఎస్టీ మైనార్టీ లందరూ విద్య ఆర్థిక రాజకీయ రంగాలలో ముందుకు వెళ్లాలని 18 వ శతాబ్దంలోనే కృషిచేసి బడుగు బలహీన వర్గాలకు మరీ ముఖ్యంగా అట్టడుగున వర్గాలకు,మహిళలకు విద్యను అందిస్తేనే వారు చైతన్యవంతమై ఆత్మగౌరవంతో ముందుకెళ్తారని పూలే సతీమణి సావిత్రిబాయి కు చదువు నేర్పి భారతదేశంలో మొట్టమొదటి మహిళా ఉపాధ్యాయురాలిగా ఆమెను తీర్చిదిద్ది శూద్రులకు, అతిశూద్రులకు చదువును నేర్పే కార్యక్రమాన్ని రూపొందించి అనేక రకాల సంఘ సంస్కరణలు తీసుకొచ్చి ఈరోజు మనం ఇంత చైతన్యం అయ్యేలా మనందరికీ స్ఫూర్తిదాయకంగా నిలిచిన గొప్ప మహోన్నత వ్యక్తి మహాత్మ జ్యోతిరావు పూలే అని అన్నారు. ఆయన ఆశయాలు మనం పునికి పుచ్చుకోవాలని ఆయన వివరించారు ఈ కార్యక్రమంలో సామాజిక ఉద్యమ కారులు, మహిళా నాయకురాలు కొత్తగట్టు లలితమ్మ-మల్లన్న , బీసీ సంఘం నాయకులు కడెం మల్లయ్య యాదవ్, సామాజిక ఉద్యమ నాయకులు కందుకూరి ప్రవీణ్, చేను శ్రీనివాస్, ఎండి కాసిం, బుసిపాక ఉదయ్ కుమార్, తన్నీరు రాంప్రభూ, మాజీ ఎంపీపీ కొమ్మినేని సతీష్, మాజీ కౌన్సిలర్ ఎల్సోజి నరేష్, రజక సంఘం నాయకులు పులిమామిడి సోమన్న, బిక్షం, వెంకన్న, వడ్డెర సంఘం నాయకులు ముద్దంగుల యాదగిరి, రూపాని వెంకన్న,పద్మశాలి సంఘం నాయకులు చింతకింద మురళి, సోమనారాయణ, తుమ్మ చంద్రమౌళి, ఎల్లంల యాదగిరి, బలిజ సంఘం నాయకులు సోమరాజు, వంగరి బ్రహ్మం, గంట యాకూబ్, విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు వై దీన్ దయాల్, ఏమోజు రవీంద్ర చారి, కృష్ణ చారి, మైనార్టీ సంఘం నాయకులు ఎండీ షకిల్ పాషా, రషీద్, గౌడ సంఘం నాయకులు గిలకత్తుల రాము గౌడ్,రామ్మూర్తి గౌడ్, లంబాడి సంఘం నాయకులు ఠాకూర్ నాయక్, భూక్య విజయ నాయక్, కిస్తూ నాయక్, శ్రీను నాయక్, యాదవ సంఘం నాయకులు పయ్యముల వెంకన్న యాదవ్, పనికెర యాదగిరి, కందుకూరి లక్ష్మయ్య, మున్నూరు కాపు సంఘం నాయకులు పసునూరి శ్రీనివాస్, నాయి బ్రాహ్మణ సంఘం నాయకులు జంపాల రాజు, వినయ్, వంగాల దానయ్య తదితరులు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారు.