ఇసుక క్వారీల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకోవాలి : ఏఎస్పీ

Jul 10, 2025 - 20:14
Jul 11, 2025 - 19:05
 0  1
ఇసుక క్వారీల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకోవాలి : ఏఎస్పీ

ఇసుక క్వారీల పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకోవాలి : ఏఎస్పీ

నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవు

వాజేడు, జులై 10 తెలంగాణ వార్త  : ములుగు జిల్లా ఏటూర్ నాగారం ఏఎస్పీ పరిధిలోని ఇసుక క్వారీల వాళ్లు పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకుని ఆ స్థలంలో మాత్రమే ఇసుక లారీలను పార్కింగ్ చేసుకోవాలని నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తప్పవని ఏటూరునాగారం ఏఎస్పీ శివం ఉపాధ్యాయ హెచ్చరించారు. ఆయన మాట్లాడుతూ… ధర్మారం ఇసుక క్వారీకి లోడింగ్ కోసం వచ్చే లారీల వలన పార్కింగ్ స్థలం కానటువంటి రోడ్లపైన లారీల డ్రైవర్లు ఇష్టం వచ్చినట్లు పార్కింగ్ చేయడంతో 102 వాహనం నిలిచి పోయింది ధర్మారం నుండి చెరుకూరు గ్రామాల మధ్యలో ట్రాఫిక్ జామ్ అయ్యిందన్నారు.దీంతో పేరూరు, అయ్యవారిపేట, ధర్మారం, చెరుకూరు గ్రామప్రజల ప్రయాణానికి ఆటంకం కలుగడంతో పేరూరు ఎస్ఐ జి.కృష్ణ ప్రసాద్ తన సిబ్బందితో 11నుండి 1 గంటల వరకు ట్రాఫిక్ క్లియర్ చేసి రాంగ్ పార్కింగ్ లో నిలిపినటువంటి 30లారీలకు ఫైన్ విధించడం జరిగిందన్నారు. ఈ సందర్భంగా ఏటూరునాగారం ఏఎస్పీ మాట్లాడుతూ… కచ్చితంగా ఇసుక క్వారీ నిర్వహించే ధర్మారం, టేకులగూడెం యజమానులు తప్పనిసరిగా పార్కింగ్ స్థలం ఏర్పాటు చేసుకోవాలని హెచ్చరించారు. అలాగే 163జాతీయ రహదారిపైన వాహనాలు నిలుపరాదు, డ్రైవర్లు మద్యం సేవించి వాహనాలు నడుపరాదని, అతివేగంతో వాహనాలు నడపకూడదని సూచించడం జరిగిందన్నారు.

Alli Prashanth ములుగు జిల్లా స్టాఫ్ రిపోర్టర్