మల్లమ్మ కుంట ను సందర్శించిన ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డా.SA సంపత్ కుమార్ .

జోగులాంబ గద్వాల 19 జూలై 2024 తెలంగాణ వార్తా ప్రతినిధి:- వడ్డేపల్లి అలంపూర్ నియోజక వర్గం వడ్డేపల్లి మండలం తనగల గ్రామంలో మల్లమ్మ కుంట రిజర్వాయర్ ఏర్పాటు చేయాలనే సంకల్పం తో నిన్న సంబధిత నీటి పారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ని కలిసి వినతి పత్రం అందజేయడం తో పాటు హుటాహుటిన కదిలిన యంత్రాంగం తో కలిసి నేడు మల్లమ్మ కుంట నీ సందర్శించి అధికారులతో చర్చించి రిజర్వాయర్ ఏర్పాటు తో ప్రాంత ప్రజలకు కలిగే ప్రయోజనాలు ,మరియు విధి విధానాల పైన సుదీర్ఘ ప్రణాళిక ప్రకారం రైతులు ,అధికారుల సూచనలు సేకరించి , ఈ రిజర్వాయర్ ఏర్పాటు కారణంగా భూమిని కోల్పోయే బాధితులకు కూడా కాంగ్రెస్ ప్రభుత్వం నుంచి న్యాయం జరిగేలా చూస్తామని ,మరియు సంబంధిత శాఖ అధికారులు వెంటనే మల్లమ్మ కుంట రిజర్వాయర్ ఏర్పాటు పనులను త్వరితగతిన పూర్తి చేయాల్సిందిగా కోరిన ఏఐసీసీ కార్యదర్శి మాజీ ఎమ్మెల్యే డా.SA సంపత్ కుమార్ వీరితో పాటు సంబధిత నీటి పారుదల ,రెవెన్యూ ,తదితర శాఖల అధికారులు,రైతులు ,కాంగ్రెస్ నాయకులు ,కిసాన్ సెల్ నాయకులు ,తదితరులు పాల్గొన్నారు .