తెలంగాణ కేబినెట్‌లో మావోయిస్టులు

కేంద్రమంత్రి బండి సంజయ్ సంచలన వ్యాఖ్యలు
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పై కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కీలక వ్యాఖ్యలు చేశారు. ఈ మేరకు సోషల్ మీడియా వేదికగా ట్వీట్ పెట్టారు. మావోయిస్టు సిద్ధాంతాన్ని అంతం చేయలేమని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అనడం పోలీసుల త్యాగాలను అవమానపరచడమే అని అన్నారు. ప్రస్తుతం తెలంగాణ హోంమంత్రి గానూ కొనసాగుతున్న రేవంత్ రెడ్డి నుంచి ఇలాంటి వ్యాఖ్యలు చేయడం సరికాదని.. కనీసం పోలీసులకు అయినా గౌరవం ఇవ్వాలని సూచించారు. మాజీ మావోయిస్టులు ప్రస్తుతం రాష్ట్ర కేబినెట్‌లో ఉన్నారని హాట్ కామెంట్స్ చేశారు. అంతేగాకుండా ఒక మావోయిస్టును పద్మ అవార్డుకు సిఫారసు చేశారని అన్నారు. మావోయిస్టు భావజాలం ఉన్నవారే రాష్ట్ర విద్యా కమిషన్‌లోనూ ఉన్నారని తెలిపారు. ప్రస్తుత ఇండియా కూటమి ఉప రాష్ట్రపతి అభ్యర్థి సుదర్శన్ రెడ్డి ది కూడా మావోయిస్టు భావజాలమే అని అన్నారు. తెలంగాణ యువతను తిరిగి మావోయిజం వైపు మళ్లించేలా, మళ్లీ అడవుల బాట పట్టించేలా సీఎం రేవంత్ రెడ్డి ప్రసంగాలు చేస్తున్నారని బండి సంజయ్ మండిపడ్డారు.