రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

Oct 15, 2025 - 23:23
Oct 15, 2025 - 23:25
 0  0
రైతు పండించిన ప్రతి గింజను ప్రభుత్వమే కొనుగోలు చేస్తుంది

డ్డగూడూరు15 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల పరిధిలో చిర్రగూడూర్ గ్రామంలో పిఎసిఎస్ వారి ఆధ్వర్యంలో వరి ధాన్యాన్ని ఎమ్మెల్యే మందల సామేల్ కొనుగోలుకేంద్రాన్ని ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులు పండించిన పంటను ఒక్క క్వింటకు 2389 రూపాయల చొప్పున ప్రతి గింజ గవర్నమెంట్ కొనుగోలు చేస్తుందని అన్నారు.రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని తెలియజేశారు. వడ్లతూకం వేసి సమయంలో రైతుకు నష్టం కలగకుండా చూడాలని అధికారులను కోరారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి పి.ఏ.సి.ఎస్.చైర్మన్ కొప్పుల నిరంజన్ రెడ్డి,వైస్ చైర్మన్ చెడే చంద్రయ్య,సి.ఓ వెంకటేశ్వర్లు,ఏవివో అక్షర టిపిసిసి రాష్ట్ర నాయకులు ఇటుకల చిరంజీవి,బాలేoల సైదులు,మోత్కూర్ మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి, మోత్కూర్ డైరెక్టర్లు బాలేoల విద్యాసాగర్ చిత్తలూరు సోమయ్య, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు పాశం సత్యనారాయణ,మహిళా నాయకురాలు,అధికారు ఎంపీడీవో శంకరయ్య, గ్రామస్తులు పార్టీ కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.