ఘనంగా శ్రీ చిన్న జీయర్ స్వామి పుట్టినరోజు సంబరాలు
జోగులాంబ గద్వాల 1 నవంబర్ 2024 తెలంగాణ వార్త ప్రతినిధి:- మల్దకల్ విశిష్ట అద్వైత గురువు శ్రీ త్రిదండి శ్రీమన్నారాయణ చిన్న జీయర్ స్వామి 69వ పుట్టినరోజు వేడుకలు అనేకమంది భక్తుల మధ్య మల్దకల్ క్షేత్రంలో శుక్రవారం ఘనంగా జరిగింది. ఆదిశిలా క్షేత్రం మల్దకల్ శ్రీ స్వయంభూ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి దేవాలయం ఆవరణలో శ్రీ చిన్న జీయర్ స్వామి చిత్రపటాన్ని ఉంచి వికాస తరంగిణి శిష్య బృందం ఆధ్వర్యంలో పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో దేవాలయ చైర్మన్ పట్వారి ప్రహ్లాద రావు, ఈవో సత్య చంద్రారెడ్డి ఆధ్వర్యంలో బూడిదపాడు నారాయణరెడ్డి దంపతులు పాల్గొని బ్రాహ్మణులకు వస్త్ర దానం చేశారు. ఈ సందర్భంగా వికాస తరంగిణి సభ్యులు స్వామివారి చిత్రపటముతో గ్రామ ప్రదక్షణ నిర్వహించారు. అనంతరం అన్నదాన కార్యక్రమం జరిగినది. ఈ కార్యక్రమంలో వికాస తరంగిణి జిల్లా అధ్యక్షుడు వెంకటేశ్వర రెడ్డి పూజారి నర్సింహులు మలకల్ పెద్దోడి టైలర్ నరసింహులు వివిధ గ్రామాలకు చెందిన మహిళ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.