నందిన్నె గ్రామంలో రోడ్లపై మురుగునీరు.  పట్టించుకోని అధికారులు

Oct 6, 2025 - 19:37
Oct 6, 2025 - 19:47
 0  9

 జోగులాంబ గద్వాల 6 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : కేటీ దొడ్డి మండలం: నందిన్నె గ్రామంలో సంవత్సరాలుగా రోడ్లపై మురుగు పారుతూనే ఉంది. ఈ మురుగు పారుతుండడం వలన దోమల బెడద ఎక్కువగా అయి టైఫాయిడ్, మలేరియా వంటి జ్వరాలు వస్తున్నాయి. అలాగే నందినే నుండి కుచినెర్ల గ్రామానికి వెళ్లే రోడ్డు మార్గాన వాహన దారులు కిందపడిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి అన్నారు. నందినే గ్రామాన్ని పట్టించుకునే నాధుడు లేడని గ్రామ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరియు రాయచూరు వెళ్లే ప్రధాన రహదారి కూడా ఇదే కావడంతో,రోడ్డు పెద్ద గుంతల గా ఉండడంతో ఎన్నో ప్రమాదాలు జరిగాయి అని గ్రామస్తులు తెలిపారు. గతంలో ఒక ప్యాసింజర్ ఆటో గుంతలో  బోల్తాపడడం జరిగింది. ఈ రోడ్డు గుంతలమయంగా ఉండడం వల్ల ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎన్నో ప్రమాదాలు జరిగినా అధికారులు స్పందించడం లేదని, జిల్లా అధికారులు స్పందించి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని నందిన్నె గ్రామస్థులు  కోరుతున్నారు..

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333