డాక్టర్ సార్ మీ సేవ మర్చిపోము ఏపూర్ గ్రామ బీద ప్రజలు

హైదరాబాద్ 15 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:–
సూర్యాపేట జిల్లా నూతనకల్ మండల పరిధిలోని ఏపూర్ గ్రామ పేదల దత్తత దార్షానిక వైద్య డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ బీద ప్రజలకు వైద్యం చేయడంలో అండగా నిలిచారు.సూర్యాపేట విన్నుతన హాస్పిటల్ లో పేషెంట్ ను చేర్పించగా గాంధీ హాస్పిటల్ తీసుకెళ్లాలని చెప్పగా మన ఊరి దాతల ఆర్థిక సహాయంతో ఎల్.బి నగర్ లో రాక్ టౌన్ కాలనీ రోడ్ 3లో పవన్ సాయి హాస్పిటల్ తీసుకెళ్లగా నవిల కరుణాకర్ ను ఐసీయూ ఏమర్జెన్సీ రెండు రోజులు వైద్యం అందించి యేదా స్థానానికి తీసుకురావడం జనరల్ వార్డులో 3రోజులు అతీతక్కువ ఖర్చుతో వైద్యం అందించి బుధవారం రోజు డిచ్చర్జీ చేసిన డాక్టర్..పేదలు వైద్యం గురించి అధైర్యం పడవద్దని వైద్య సేవకై నేనున్నా అని వారి కుటుంబ జీవితాల్లో వెలుగులు నింపిన డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ కి ఏపూర్ గ్రామ ప్రజలు కృతజ్ఞతలు తెలిపి మీలాంటి వారు మా ఊరికి దొరకడం మా అదృష్టంగా బావిస్తున్నామని అన్నారు.మా గ్రామ బీద ప్రజలకు చేస్తున్న సేవలకు మీకు రుణపడి ఉంటామని గ్రామస్తులు అన్నారు.డాక్టర్"ఆలేటి శ్రీనివాస్ గౌడ్ మాట్లాడుతూ.. మాది నల్గొండ జిల్లా శాలిగౌరారం మండలం తుడిమిడి మారుమూల గ్రామంలో నిరుపేద కుటుంబంలో పుట్టి పెరిగి చిన్న వయసులోనే పేదలకు సహాయం పేదలకు వైద్య సహాయం చేయాలని దృక్పథంతో కష్టపడి చదివి డాక్టర్ వృత్తిని ఎంచుకున్నారు. అందరూ బాగుండాలని పేద ప్రజలకు సేవ చేయడమే నా లక్ష్యంగా ఎంచుకున్నామని అన్నారు.