అడ్డగూడూరులో కాంగ్రెస్ ఇంటింటి బాకీ కార్డుల పంపిణీ కార్యక్రమం
కార్యక్రమంలో పాల్గొన్న మండల బిఆర్ఎస్ పార్టీ నాయకులు

అడ్డగూడూరు 12 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్:–
గత అసెంబ్లీ ఎన్నికల్లో అబద్దపు హామీలను ఇచ్చి ప్రజలను మోసం చేసిన కాంగ్రెస్ ప్రభుత్వాన్ని రాబోవు స్థానిక ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకులను నిలదీసి అడిగే సమయం ఆసన్నమైంది అన్నది ప్రజల్లోకి తీసుకెళుతూ ఆదివారం రోజున అడ్డగూడూరు మండల కేంద్రంలో తుంగతుర్తి మాజీ ఎమ్మెల్యే డాక్టర్ గాదరి కిశోర్ కుమార్ ఆదేశాల మేరకు బిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షుడు కొమ్మిడి ప్రభాకర్ రెడ్డి ఆధ్వర్యంలో వాడ వాడలా కాంగ్రెస్ ఇంటింటి బాకీ కార్డులను పంపిణీ చేస్తూ కాంగ్రెస్ పార్టీ మోసాలను ప్రజలకు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ చిప్పలపల్లి మహేంద్ర నాథ్ ,మాజీ యoపిపి దర్శనాల అంజయ్య బిఆర్ఎస్ నాయకులు తదితరులు పాల్గొన్నారు.