వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఏర్పాటు చేయండి.DYFI
జోగులాంబ గ ద్వాల 2 సెప్టెంబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : గద్వాల జిల్లాలో వ్యవసాయదార పరిశ్రమలు ఏర్పాటు చేసి యువతకు ఉపాధి కల్పించాలని భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (DYFI) రాష్ట్ర అధ్యక్షుడు కోట రమేష్ డిమాండ్ చేశారు. మంగళవారం జిల్లా కేంద్రంలోని స్థానిక సీఐటీయు జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పాల్గొన్నారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యవసాయం ప్రధానంగా ఆధారపడి జీవిస్తున్న నడిగడ్డలో వ్యవసాయ ఆధార పరిశ్రమలు ఏర్పాటు చేసి జిల్లా యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలని డిమాండ్ చేశారు.జిల్లా ఏర్పడి తొమ్మిది సంవత్సరాలు కావోస్తున్న వ్యవసాయ,వ్యవసాయేతర పరిశ్రమలు ఏర్పాటు చేసి ఉపాధి కల్పించాలనే ధ్యాస స్థానిక ప్రజాప్రతినిధులకు లేకపోవడం సిగ్గుచేటని విమర్శించారు.పాలకులు మాదక ద్రావ్యాలను పరోక్షంగా ప్రోత్సహిస్తూ యువతను చెడు సంస్కృతికి, అలవాట్లకు బానిసలుగా చేస్తూ యువశక్తి ని నిర్వీర్యం చేస్తూ వారి కుటుంబాలను నాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.ఒప్పంద,పొరుగు సేవల ఉద్యోగాలలో సైతం స్థానిక యువతకు అవకాశం ఇవ్వకుండా మోసం చేస్తున్న పాలకుల మోసాలను యువత గమనించాలని అన్నారు.జిల్లా లోని వివిధ రకాల మిల్లులు,పరిశ్రమ లలో సైతం స్థానిక యువతకు కాకుండా ఇతర రాష్ట్రల వారికి అవకాశం కల్పిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.కేంద్ర ప్రభుత్వం యంగ్ ఇండియా,స్కిల్ ఇండియా,స్టార్ట్ అప్ ఇండియా వంటి కార్యక్రమాలను ప్రకటించింది గాని అమలు పరచడం లేదని 50 కోట్ల యువజనుల నైపుణ్యాలను పెంపొందించి,దేశ అభివృద్ధి లో యువత ను భాగస్వామ్యం చేద్దామన్న ఆలోచనలు పాలకులకు లేకపోవడం బాధాకరం అన్నారు.పౌరులకు నాణ్యమైన విద్య, సామర్థ్యానికి తగ్గ ఉపాధి కల్పించడం రాజ్యాంగం కల్పించిన హక్కు అని, కానీ నేటి పాలకులు రాజ్యాంగ హక్కులను కాలరాస్తున్నారని విమర్శించారు.బిజెపి ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిందని, గత 11 సంవత్సరాలలో 22 కోట్ల ఉద్యోగాల గురించి కేంద్ర ప్రభుత్వాన్ని యువత ప్రశ్నిస్తే విద్వేషాలు సృష్టిస్తున్నారని విమర్శించారు.ఉపాధి అవకాశాలు లేక నిరుద్యోగ యువత అతి తక్కువ వేతనాలకు పని చేస్తూ శ్రమ దోపిడీకి గురి అవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రెండు లక్షల ఉద్యోగాలు ఇస్తామని,నాలుగు వేల నిరుద్యోగ భృతి ప్రకటించి అమలు చేస్తామని ప్రకటించిన రాష్ట్ర ప్రభుత్వం, యువతకు కనీసం స్వయం ఉపాధి పొందెందుకు రాజీవ్ యువ వికాస్ పథక అమలులో కూడా విఫలం అయిందని విమర్శించారు.యువజనులు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చిన హామీల అమలుకై ఉద్యమాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు.అనంతరం జిల్లా కన్వీనర్ గా ఉప్పేర్ అంజి, కో కన్వీనర్ గా గంగాధర్,కమిటీ సభ్యులు గా సజీవ రాజు,రాము,రామాంజనేయులను ఎన్నుకున్నారు.ఈ సమావేశంలో సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షులు ఉప్పేర్ నరసింహ,DYFI సభ్యులు మోష, రాము, M. శ్రీనివాస్,వినయ్,రామాంజి పాల్గొన్నారు.
ధన్యవాదాలతో
ఉప్పేర్ అంజి (DYFI) జిల్లా కన్వీనర్ జోగులాంబ గద్వాల జిల్లా.