వికలాంగులకు విద్యా వైద్యం ఉపాధి అవకాశాలు కల్పించాలి

నారాయణపురం 15 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– నారాయణపురం మండల పరిధిలోని పుట్టపాక గ్రామంలో ఎన్.పి.ఆర్.డి గ్రామ కమిటీ సమావేశం సందర్భంగా ఎన్ పి ఆర్ డి జిల్లా ప్రధాన కార్యదర్శి వనం ఉపేందర్ మాట్లాడుతూ..ఈనెల 25 26న హైదరాబాద్ సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జాతీయ సదస్సును మన జిల్లా వ్యాప్తంగా పెద్ద సంఖ్యలో పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునివ్వడం జరుగుతుంది.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వికలాంగులకు విద్య వైద్య ఉపాధి అవకాశాలు కల్పించాలి వికలాంగులకు ఈ జిల్లాలో చదువుకుందా మంటె (21)రకాల వైకల్యం ఉన్న మండల కేంద్రాల్లోచదువుకుందామంటే స్కూల్ లేకపోవడం వల్ల వికలాంగులు ఇబ్బంది పడుతున్నారు. అందుకోసం ప్రతి మండల హెడ్ క్వార్టర్ లో గవర్నమెంట్ ఆధ్వర్యంలో అన్ని రకాల వైకల్యం వాళ్లకు చదువుకోవడానికి స్కూల్ ఏర్పాటు చేయాలని అదేవిధంగా వికలాంగుల కుటుంబాల పిల్లలకు చదువుకు సంబంధించిన అన్ని రకాల బాధ్యత ప్రభుత్వమే భరించాలని డిమాండ్ వికలాంగుల వైద్యం రాష్ట్రంలో ఉన్న అన్ని పెద్ద ప్రైవేటు హాస్పిటల్లో వికలాంగులకు ఉచితంగానే గవర్నమెంట్ ద్వారా ఏర్పాటు చేయాలని అన్ని రకాల వైద్యం కల్పించాలని ఎందుకంటే వికలాంగులు చాలామంది అనారోగ్యం కారణం వల్ల కిడ్నీల బారినపడి.గుండె జబ్బు
లతో హాస్పటల్లో చూపెట్టుకోలేక వికలాంగులు చాలామంది చనిపోవడం జరుగుతుంది.కావున ఈ బాధ్యత గవర్నమెంట్ బాధ్యత తీసుకోవాలని అన్ని రకాల హాస్పిటల్ లో ఉచితంగా వైద్యం అందిచాలని బాధ్యత ప్రభుత్వమే భరించాలని డిమాండ్ వికలాంగులకు ఉపాధి అవకాశాలు కల్పించాలని వికలాంగులకు చిన్నచిన్న వ్యాపారం చేసుకోవడానికి అదేవిధంగా బస్టాండ్లో షాపింగ్ కాంప్లెక్స్ లాంటి జిల్లావ్యాప్తంగా ఉపాధి కల్పించాలని ప్రతి వికలాంగునికి ఉపాధి కోసం బ్యాంకు ద్వారా ఇలాంటి చర్తులు లేకుండా 100% సబ్సిడీతో పది లక్షల రూపాయలు రుణం ఇవ్వాలని డిమాండ్ చేశారు.ఈ రాష్ట్ర ప్రభుత్వం వికలాంగులకు ఎన్నికల ముందు హామీ ఇచ్చిన 6వేల రూపాయలు పెన్షన్ తోపాటు స్థానిక సంస్థల్లో నామిటెడ్ పోస్టులు అమలు చేయాలని వికలాంగులకు ఉచిత బస్సు సౌకర్యం కల్పించాలని వికలాంగుల కుటుంబాలకు 300 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇవ్వాలని వికలాంగులకు అంథోదయ రేషన్ కార్డు 35 కిలో బియ్యం ఇవ్వాలని డిమాండ్ చేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో ఎన్ పి ఆర్ డి మండల అధ్యక్షులు పిట్టల శ్యాంసుందర్ గ్రామ అధ్యక్షులు రావిరాల సత్యనారాయణ ఉపాధ్యక్షులు చెరుపెల్లి వెంకటేశం మరో ఉపాధ్యక్షులు కుక్కల వెంకటయ్య ప్రధాన కార్యదర్శి జోకు వెంకటేశం సహాయక కార్యదర్శి చెన్నోజు బ్రహ్మచారి మరొక సహాయక కార్యదర్శురాలు కుకుడాల భానుమతి కోశాధికారి కానుగుల్లా వెంకటేశం కంసబ్యులు జోకు జంగయ్య మట్టిపెలి కవిత కాట్రు సుబ్బారావు చుక్క మారయ్య జోకు శంకరయ్య కొంగరి సత్తయ్య ఎన్ పి ఆర్ డి గ్రామ నూతన కమిటీ ఎన్నుకోవడం జరిగింది అనంతరం ఎన్ పి ఆర్ డి జాతీయ సదస్సు జయప్రదం చేయాలని కరపత్రం విడుదల చేయడం జరిగిందని అన్నారు.