మిషన్ భగీరథ పైప్లైన్ లీక్
జోగులాంబ గద్వాల 6 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త ప్రతినిధి : వడ్డేపల్లి శాంతినగర్ అంబేద్కర్ చౌరస్తాలో మిషన్ భగీరథ పైప్ లైన్ లీక్ కారణంగా భారీగా త్రాగునీరు వృధాగా పోతున్నది మరియు స్థానికంగా రాకపోకలకు, ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలకు కారణమవుతోంది. నిర్వహణ లోపాలు, మరమ్మతుల ఆలస్యం మిషన్ భగీరథ పైప్ లైన్లు పగిలిపోవడం, లీక్ అవ్వడం వంటి ఘటనలు జిల్లాలో తరచుగా కనిపిస్తున్నాయి. మరమ్మతులు చేయాలని కాలనీవాసులు కోరుతున్నారు.