కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే కానిది ఏమి లేదు..ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

Oct 13, 2025 - 18:39
 0  3
కాంగ్రెస్ కార్యకర్తలు తలుచుకుంటే కానిది ఏమి లేదు..ఎమ్మెల్యే యశస్విని రెడ్డి

అంబర్పేట్ 13 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– ఖైరతాబాద్ జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష ఎన్నికల ప్రక్రియలో భాగంగా అంబార్పెట్ నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన సమావేశo సోమవారం రోజు ఘనంగా నిర్వహించారు.జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్షులు రోహిన్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ సమావేశంలో ఏఐసీసీ అబ్జర్వర్ శక్తిసింగ్ గోయల్ టీపీసీసీ అబ్జర్వర్ మరియు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు.తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ కమిటీ ఆధ్వర్యంలో జరుగుతున్న సంఘటన్ సృజన్ అభియాన్ తెలంగాణ కార్యక్రమం భాగంగా ఈ సమావేశం నిర్వహించబడింది.ఈ సందర్భంగా పార్టీ బలోపేతం,నాయకత్వ ఎంపికలో ప్రజల భాగస్వామ్యం,అంతర్గత ప్రజాస్వామ్య సుస్థిరత వంటి అంశాలపై విస్తృత చర్చ జరిగింది.ఈ సందర్భంగా ఏఐసీసీ అబ్జర్వర్ శక్తిసింగ్ గోయల్ మాట్లాడుతూ..కాంగ్రెస్ పార్టీ ప్రధాన ఉద్దేశ్యం ప్రజలలోంచి వచ్చిన నాయకత్వాన్ని ప్రజల ద్వారానే ఎంపిక చేయడం.తెలంగాణ రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో ఏఐసీసీ అబ్జర్వర్లు స్థానిక నాయకులతో నేరుగా మాట్లాడి వారి అభిప్రాయాలను సేకరిస్తున్నారు.జిల్లా కాంగ్రెస్ కమిటీ అధ్యక్ష పదవికి ఆసక్తి గల అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు.నాయకుల అభిప్రాయాలను సేకరించి,టీపీసీసీ మరియు ఏఐసీసీకి నివేదిక సమర్పిస్తాం.ఈ విధానం పార్టీ అంతర్గత ప్రజాస్వామ్యాన్ని మరింత బలపరచడమే లక్ష్యం, అని అన్నారు.అలాగే టీపీసీసీ అబ్జర్వర్ మరియు పాలకుర్తి ఎమ్మెల్యే యశస్విని రెడ్డి మాట్లాడుతూ..ఈ కార్యక్రమం పార్టీకి కొత్త ఉత్సాహాన్ని తెస్తుంది.కాంగ్రెస్ ఎల్లప్పుడూ ప్రజల అభిప్రాయాలను గౌరవించే పార్టీ.ప్రజలే నాయకులను నిర్ణయించాలి అన్న స్ఫూర్తితో పార్టీ ముందుకు సాగుతుంది.అని పేర్కొన్నారు. కార్యక్రమంలో జిల్లా కాంగ్రెస్ కమిటీ నాయకులు,బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు,యువజన నాయకులు,మహిళా నాయకులు మరియు పెద్ద సంఖ్యలో కార్యకర్తలు పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేశారని తెలిపారు.

GireeshKumar Ekalavya విలేకరులు కావలెను No డిపాజిట్..! No టార్గెట్..! న్యూస్ లు మీవి ...! పబ్లిష్ మాది ..! చేయవాల్సిందల్లా ఒక్కటే న్యూస్ సేకరించడం. ఆ న్యూస్ ను పబ్లిక్ లోకి తీసుకపోవడం ప్రముఖ మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి న్యూస్ ఛానల్, పేపర్, వెబ్సైట్ చూసుకుంటుంది. మా న్యూస్ ఛానల్ నందు పనిచేయుటకు మండలాల వారిగా విలేకరులు కావలెను. సంప్రదించవలసిన నెంబర్ 9063881333