రాష్ట్ర లో ప్రధానమంత్రి ఫసల్ భీమా అమలు చేయకుండా రైతులను నిండా ముంచుతున్న తెలంగాణ రాష్ట్ర సర్కార్ ముఖ్యమంత్రి రేవంత్
బీజేపీ జోగులాంబ గద్వాల జిల్లా మాజీ అధ్యక్షులు S.రామచంద్రారెడ్డి
జోగులాంబ గద్వాల 6 అక్టోబర్ 2025 తెలంగాణ వార్తా ప్రతినిధి : మల్దకల్.*మండలం కేద్రం లో *బీజేపీ మండలం పార్టీ అధ్యక్షులు తిరుపతి రెడ్డి ఆధ్వర్యంలో అధిక వర్షాలకు దెబ్బ తిన్న పంటపొలాలను సందర్శించి అనంతరం రామచంద్రారెడ్డి మాట్లాడుతూ. ..ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఎన్నికల ముందు ఎన్నో బుటకపు హామీలు ఇచ్చి గద్దెను ఎక్కి కొన్ని హామీలు తప్ప ప్రధాన హామీలు అమలు చేయకుండా ప్రజలను రైతులను మోసం చేశాడు అని ,ముఖ్యముగా ప్రధానమంత్రి నరేంద్ర మోడీ * ప్రతిష్టత్మకంగా దేశవ్యాప్తంగా అమలు చేస్తున్న ప్రధానమంత్రి ఫసల్ భీమా యోజన పతకం ద్వారా *రైతులందరికి అన్ని పంటలకు తక్కువ ప్రీమియం తో ఎక్కవ భీమా పతకం ప్రవేశపెట్టడంజరిగింది ఈ పథకంవలన అధికవర్షాలకు, వర్షాలు తక్కువ ,వైన ఏ ఇతర ప్రకృతి వైఫరీత్యాలవలన పంటనష్టం జరిగేతే ఈ పతకం ద్వారా పూర్తిగా నష్టం పరిహారం అందుతుంది అని అన్నారు. కాబట్టి రాష్ట్రలో జరుగబోయే స్థానిక సంస్థల ఎన్నికలలో రేవంత్ ప్రభుత్వంకు రైతులు, ప్రజల అగ్రహం తప్పదని వారు అన్నారు ఈ కార్యక్రమం లో జిల్లా ఉపఅధ్యక్షులు వెంకటేశ్వర రెడ్డి, నల్లరెడ్డి, పాలయి రాముడు, నాగరాజు, తిమ్మన్న, రెడ్డెప్ప, వాసురెడ్డి, మురళిధర్ రెడ్డి, కృష్ణారెడ్డి, శివప్రసాద్, వెంకటేష్, తిమ్మప్ప, రాజశేఖర్, తిమ్మారెడ్డి, సాయినాథ్ రెడ్డి, ప్రతాప్, గోకారి, రామకృష్ణ, నర్సింహా, ఎద్దుల గోకారి, రఘు, రఘుపతిరెడ్డి, తదితరులు పాలుగోన్నారు...