ఉస్మానియా మెడికల్ కాలేజ్ లో ఎంబిబిఎస్ సీటు సాధించిన జీలకర్ర ప్రణవి

పెద్దవంగర 12 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:–
మహబూబాద్ జిల్లా పెద్దవంగర మండల పరిధిలోని ఉప్పరగూడెం గ్రామానికి చెందిన జీలకర్ర రామస్వామి నాగలక్ష్మి దంపతుల ప్రధమ కూతురు జిలకర ప్రణవి హైదరాబాద్ ఉస్మానియా మెడికల్ కాలేజ్ కోటి లో ఎంబిబిఎస్ సీటు సాధించిన జిలకర ప్రణవి ఆదివారం రోజు కాలేజీలో జైన్ కావడం జరిగింది. ఉస్మానియా మెడికల్ కాలేజ్ కోటి లో సీటు సాధించిన సందర్భంగా తల్లిదండ్రులు,బంధువులు, గ్రామస్తులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.ఈ కార్యక్రమంలో జిలకర రామస్వామి,జీలకర్ర నాగలక్ష్మి,దండే రామ్,జిలకర లక్కీ తదితరులు పాల్గొన్నారు.