వాహనాల తనిఖీలు అక్రమ రవాణా పై ఉక్కు పాదం

తిరుమలగిరి 15 అక్టోబర్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
ప్రజలకు మెరుగైన భద్రత రక్షణ కల్పించడం లక్ష్యంగా ఎఫెక్టివ్ పోలీస్ మరియు విజువల్ పోలీసింగ్ ఉద్దేశంలో భాగంగా జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు నాఖా బంది కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మండలం ఎస్సై వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో వాహనాల తనిఖీ, అక్రమ రవాణా, అనుమానితుల కదలికలు, గంజాయి రవాణా కదలికలు లాంటి వాటిపై తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ నాకాబంది కార్యక్రమంలో భాగంగా తిరుమలగిరి మండల పరిధి ఈదుల పర్రే తండా, మరియు వెలిశాల ఎక్స్ రోడ్ నందు తనిఖీలు నిర్వహించామని పిడిఎస్ బియ్యం తరలింపు, ఓవర్ లోడింగ్, గంజాయి తరలింపు, అనుమానితుల గుర్తింపు వంటి వాటిని తనిఖీలు నిర్వహించామని తెలిపారు.