అడ్డగూడూరులో ఐకెపి సెంటర్ ను ప్రారంభించిన ఎమ్మెల్యే మందుల సామేల్

అడ్డగూడూరు 13 అక్టోబర్ 2025 తెలంగాణవార్త రిపోర్టర్:– యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రంలో ఐకెపి సెంటర్ ను తుంగతుర్తి శాసన సభ్యులు మందుల సామేల్ ప్రారంభించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..రైతులు పండించిన పంటను ఒక్క క్వింటకు 2389 రూపాయల చొప్పున ప్రతి గింజ గవర్నమెంట్ కొనుగోలు చేస్తుందని అన్నారు.రైతులు దళారుల చేతిలో మోసపోవద్దని తెలియజేశారు.ఈ కార్యక్రమంలో మండల కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు నిమ్మనగోటి జోజి,కాంగ్రెస్ పార్టీ సీనియర్ సోమిరెడ్డి,వల్లభట్ల రవికుమార్,టీపీసీసీ రాష్ట్ర నాయకులు ఇటికాల చిరంజీవి,బాలేoల సైదులు,మోత్కూర్ పిఎసిఎస్ చైర్మన్ పేలపూడి వెంకటేశ్వర్లు, మోత్కూరు మార్కెట్ వైస్ చైర్మన్ లింగాల నర్సిరెడ్డి మోత్కూర్ మార్కెట్ డైరెక్టర్లు బలేoల విద్యాసాగర్, అడ్డగూడూరు మాజీ టౌన్ అధ్యక్షులు గూడెపు పాండు,అడ్డగూడూరు యువజన కాంగ్రెస్ గ్రామ శాఖ అధ్యక్షుడు సందీప్ రెడ్డి,మోత్కూర్ మార్కెట్ మాజీ డైరెక్టర్ బోడ యాదగిరి,మేకల పవన్,బాలెoల సురేష్, సంబంధిత అధికారులు పార్టీ కార్యకర్తలు మహిళలు రైతులు తదితరులు పాల్గొన్నారు.