చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి

తెలంగాణ వార్త మాడుగులపల్లి ఫిబ్రవరి 28:- మాడుగులపల్లి మండలంలోని పెద్దదేవులపల్లి గ్రామంలో చెరువులో చేపల వేటకు వెళ్లి వ్యక్తి మృతి చెందిన ఘటన చోటు చేసుకుంది.మాడుగులపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెద్దదేవులపల్లి గ్రామానికి చెందిన తౌడబోయిన విజయ్, తండ్రి సోమయ్య, వయసు 32 సంవత్సరాలు గత వారం రోజుల క్రితం 23.02.2025 రోజు సాయంత్రం 5 గంటల సమయంలో పెద్దదేవులపల్లి గ్రామ చెరువు లో చేపల వేటకు వెళ్లిన మృతుడు తౌడబోయిన విజయ్, రాత్రి వరకు ఇంటికి రాకపోవడంతో తన తల్లి జయమ్మ ,బంధువులు అతని గురించి వెతుకుతుండగా జాడ తెలియకపోవడంతో తేదీ 25.02.2025 రోజు ఉదయం తన కొడుకు కనిపించడం లేదని ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి వెతుకుతుండగా అదే రోజు సాయంత్రం మూడు గంటల సమయంలో మృతుని శవం నడిగూడెం మండలం సిరిపురం శివారులో గల సాగర్ ఎడమ కాలువ నందు తెలియాడుతూ ఉండగా గుర్తించి పోస్టుమార్టం నిమిత్తం మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నందు ఉంచి 26.02.2025 బుధవారం రోజు విచారణ చేసి మిర్యాలగూడ ఏరియా ఆసుపత్రి నందు పోస్టుమార్టం నిర్వహించి శవాన్ని అప్పగించినారు.మృతుడు ప్రమాదవశాత్తు గ్రామ చెరువులో చేపల వేటకు వెళ్లి చెరువులో పడి నీటి ప్రవాహం వలన కొట్టుకొని పోయి నీటిలో మునిగి ఊపిరాడక చనిపోయినట్లు ప్రాథమిక దర్యాప్తులో తేలిందనీ తెలిపారు.