సివిల్ ర్యాంకర్ అఖిల్ ను సత్కరించిన కాలనీవాసులు

Apr 24, 2024 - 21:20
Apr 25, 2024 - 18:28
 0  24
సివిల్ ర్యాంకర్ అఖిల్ ను సత్కరించిన కాలనీవాసులు
సివిల్ ర్యాంకర్ అఖిల్ ను సత్కరించిన కాలనీవాసులు

తెలంగాణవార్త కొండపాక :- కొండపాక ఏప్రిల్ 24 కొండపాక గ్రామానికి చెందిన బుద్ధి అఖిల్ ఐఏఎస్ లో ర్యాంకు సాధించడంతో ఆ కాలనీవాసుల్లో ఆనందం వెల్లి విరుస్తుంది. తమ కళ్ళ ముందు పెరిగిన పిల్లగాడు కలెక్టర్ కాబోతున్నాడని ఆనందం వారి మాటల్లో వ్యక్తం అవుతుంది. ఢిల్లీ నుంచి వచ్చిన అఖిల్ నివాసముంటున్న కొండపాకలోని క్రాంతి నగర్ లో కాలనీవాసులు కలిసి ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో ఆంజనేయులు యాదవ్, మాజీ వార్డు సభ్యులు జంజరపు నరసింహులు, ఎండి షఫీ ,ఈరబోయిన నర్సింహులు, కరుణాకర్ ,దుబ్బుల సత్తయ్య, రవీందర్ ,పరుశరాములు గౌడ్, మల్లేశం ,రమేష్ ,విష్ణుమూర్తి తదితరులు పాల్గొన్నారు

T.Sathya Goud Kndapaka Mandal Reporter Siddipet District Telangana State