స్నేహ పూరిత వాతావరణం లో గణేష్ నవరాత్రి ఉత్సవాలు జరుపుకోవాలి 

Sep 6, 2024 - 19:04
Sep 6, 2024 - 19:30
 0  48

తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు 

తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్

సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు పంతంగి వీరస్వామి గౌడ్ 


సూర్యాపేట టౌన్ 6 సెప్టెంబర్ 2024 తెలంగాణవార్త ప్రతినిధి:- పండుగలు సంస్కృతి సంప్రదాయాలను తెలియజేస్తాయి రాష్ట్ర ప్రజలందరికీ వినాయక చవితి శుభాకాంక్షలు  తెలంగాణ జై గౌడ సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ తెలంగాణ సామాజిక ఉద్యమకారుడు సూర్యాపేట జిల్లా రియల్ ఎస్టేట్ వ్యాపార అసోసియేషన్ అధ్యక్షుడు సావిత్రిబాయి పూలే జాతీయ విశిష్ట సేవా అవార్డు గ్రహీత పంతంగి వీరస్వామి గౌడ్ వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేశారు. శుక్రవారం సూర్యాపేట జిల్లా కేంద్రంలో తన కార్యాలయం నుండి విలేకరులతో మాట్లాడారు.  ఆయన మాట్లాడుతూ.. సకల శాస్త్రాలకు అధిపతిగా, బుద్ధికి, జ్ఞానానికి ఆరాధ్యుడుగా ఆటంకాలను తొలగించే విగ్నేశ్వరుడిగా భక్తిశ్రద్ధలతో హిందువులు ఆరాధ్య దైవంగా ఆరాధిస్తారని ఆయన అన్నారు. శాంతియుతంగా గణపతి నవరాత్రి ఉత్సవాలను రాష్ట్ర ప్రజలంతా ఘనంగా జరుపుకోవాలని ఆయన ఆకాంక్షించారు. గణనాధుని ఆశీస్సులు కలకాలం అందరిపై ఉండాలని అందరికీ మంచి జరగాలని కోరారు.

 పండుగలు సంస్కృతి సాంప్రదాయాలను కళావంతం చేస్తాయని ముందు విఘ్నేశ్వరుని పూజించి విజ్ఞాలను తొలగించుకొని  శుభకార్యాలు ప్రారంభిస్తారు సహృదయంతో నమ్ముకున్న భక్తులకు వినాయక చవితి అష్టైశ్వర్యాలు ప్రసాదిస్తుందని ప్రగాఢ విశ్వాసం. ఆధ్యాత్మిక భక్తి ఐక్యతను పెంపొందించి మానవ సంబంధాలను బలోపేతం విజ్ఞనలను తొలగించే విజ్ఞేశ్వరుడు గణేష్ అని నవరాత్రి ఉత్సవాలు ప్రజలు జరుపుకుంటారు 9 రోజులపాటు జరిగే ఈ ఉత్సవాల్లో ప్రజలు ఎంతో భక్తిశ్రద్ధలతో గీతాలు ఆలపిస్తూ పూజలు నిర్వహిస్తారు అని ఆయన అన్నారు. ఆ భగవంతుని ఆశీస్సులు అందరిపై ఉండాలని ఆయన కోరారు.

Telangana Vaartha వినూత్న రీతిలో వెలువడుతూ విశేష ఆదరణ పొందుతున్న మన రాష్టం - మన వార్తలు తెలంగాణవార్త తెలుగు డైలీ, వెబ్ న్యూస్ ఛానల్ మరియు యాప్ లో పనిచేయడానికి తెలంగాణలో అన్నీ ప్రాంతాలకు జిల్లా స్టాఫ్ రిపోర్టర్లు, రిపోర్టర్లు కావలెను. https:// www.telanganavaartha.com. తెలంగాణవార్త మీకు అవకాశం కల్పిస్తుంది. సీనియర్లకు ప్రాధాన్యత, కొత్తవారికి అవకాశం ఉంటుంది. Cell: 90638 81333