అనుమతి ముసుగులో అక్రమ రవాణా

పెద్దఎత్తున ప్రభుత్వ ఆదాయానికి గండి
అభివృద్ధి పనుల ముసుగులో అక్రమ దందా
మైనర్లే డ్రైవర్లు
తిరుమలగిరి 05 ఏప్రిల్ 2025 తెలంగాణ వార్త రిపోర్టర్
సూర్యాపేట జిల్లా తిరుమలగిరి మున్సిపల్ కేంద్రం అనంతరం బికేరు వాగు నుండి ఇసుక అక్రమ రవాణాకు బ్రేకులు పడడం లేదు. టీఎస్‌ఎండీసీ ద్వారా కమర్షియల్ ఇసుక రీచులు, స్యాండ్ ట్యాక్సీ ద్వారా స్థానికులకు ఇసుకను ప్రభుత్వం విక్రయిస్తున్నా కూడా అక్రమం దందా ఆగడం లేదు. కొంతమంది నేతల కనుసన్నల్లో స్థానికంగా ఉండే కొందరు రాత్రి వేళల్లో , అనంతరం తాటిపాముల నుంచి ఇసుకను అక్రమంగా తరలిస్తూ ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు. బికిరు వాగు తీరం వెంబడి రహస్య ప్రాంతంలో డంపింగ్ చేస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి ఈ అక్రమ రవాణాతో స్యాండ్ ట్యాక్సీ ద్వారా . గతంలో తిరుమలగిరి మండలంలో తనిఖీలు చేయగా ఇసుక అక్రమ డంపులు దొరికాయి. .
అనుమతుల మాటున దందా..!
పోలీసులు, అధికారులు ఎవరైనా అడిగితే తెచ్చుకున్న అనుమతులు చూపుతున్నారు. అనుమతులు పొందిన ట్రాక్టర్ ద్వారా ఇసుకను ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకే రవాణా చేయాల్సి ఉంది. కానీ ఉదయం 7 గంటల నుంచే రవాణా మొదలవుతోంది. ఎన్ని ట్రాక్టర్లు తీసుకెళ్తున్నారు? ఎక్కడికి చేరవేస్తున్నారన్న దీనిపై అధికారుల నిఘా కరవైంది. దీంతో అక్రమార్కులకు అడ్డు లేకుండా పోయింది. అనుమతుల పేరుతో ట్రాక్టర్ లో ఇసుక రవాణా ఒక ఎత్తయితే.. ఎలాంటి అనుమతులు లేకుండానే వాగుల్లో ట్రాక్టర్లతో ఇసుక తరలించడం మరో ఎత్తు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారు. ఎవరైనా అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన అధికారులు, పోలీసులు చూసీచూడన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రవాణాపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
రాత్రివేళలో రవాణా..
రాత్రి వేళలో పదుల సంఖ్యలో ట్రాక్టర్ల ద్వారా దళారులు ఇసుకను అక్రమంగా రవాణా చేస్తున్నారు. ప్రభుత్వ పనులకు సైతం అక్రమంగా ఇసుక తరలిస్తుండడంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. ఆన్ లైన్‌లో ఉన్న ట్రాక్టర్ యూనియన్ వారికి కేవలం ఒక రోజుకు ఒక ట్రిప్ మాత్రమే లభిస్తోంది. ఇప్పటికైనా ఉన్నతాధికారులు స్పందించి ఇసుక అక్రమ రవాణాను అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు.
మూడు పువ్వులు ఆరు కాయలు..
పరివాహక ప్రాంతాల్లో అనుమతుల ముసుగులో ఇసుక అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. రాత్రి , పగలు అనే తేడా లేకుండా ఇసుకను తరలించుకుపోతున్నారు. మార్కెట్లో ఒక్కో ట్రాక్టర్ సుమారు రూ. 3 వేలకు పైగానే ధర పలుకుతుండటంతో అధికార పార్టీకి చెందిన కొంత మంది చోటామోటా నాయకులంతా అక్రమ ఇసుక మాఫియా పైనే దృష్టి సారించారు. దీంతో ఈ అక్రమ ఇసుక వ్యాపారం మూడు పూలు, ఆరు కాయాలుగా సాగుతుందని ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇన్సూరెన్స్ పత్రాలు, డ్రైవింగ్ లైసెన్స్ లేని మైనర్లతో రాత్రి పగలు తేడా , లేకుండా అడ్డగోలుగా ఇసుక అక్రమ రవాణా జరుపుతున్నారని, ఆయా గ్రామాల ప్రజలు పేర్కొంటున్నారు. అక్రమ రవాణాకు ఎలాంటి అవరోధాలు లేకుండా ఒక్కో ట్రాక్టర్ చొప్పున అధికారులకు భారీగా ముడుపులు అందజేస్తున్నట్లు ఆయా గ్రామాల ప్రజలు ఆరోపిస్తున్నారు. తెరవెనుక ప్రజా ప్రతినిధులు కూడా అధికారులు ఇసుక మాఫియాకు వెన్నుదన్నుగా ఉన్నట్లు సమాచారం. ఇసుక రీచ్‌లకు అనుమతులు లేని ప్రాంతాలైన , గ్రామ శివారులోని నుండి ఒక ట్రాక్టర్‌కు అనుమతి పొంది, దాని ముసుగులో పదుల సంఖ్యలో ట్రాక్టర్లు బికేరు వాగు నుండి అక్రమంగా ఇసుకను తొడిస్తూ కాసులు చేసుకుంటున్నారు.
అనుమతుల మాటున దందా..!
పోలీసులు, అధికారులు ఎవరైనా అడిగితే తెచ్చుకున్న అనుమతులు చూపుతున్నారు. అనుమతులు పొందిన ట్రాక్టర్ ద్వారా ఇసుకను ఉదయం 9:30 గంటల నుంచి సాయంత్రం 5:30 గంటల వరకే రవాణా చేయాల్సి ఉంది. కానీ ఉదయం 7 గంటల నుంచే రవాణా మొదలవుతోంది. ఎన్ని ట్రాక్టర్లు తీసుకెళ్తున్నారు? ఎక్కడికి చేరవేస్తున్నారన్న దీనిపై అధికారుల నిఘా కరవైంది. దీంతో అక్రమార్కులకు అడ్డు లేకుండా పోయింది. అనుమతుల పేరుతో ట్రాక్టర్ లో ఇసుక రవాణా ఒక ఎత్తయితే.. ఎలాంటి అనుమతులు లేకుండానే వాగుల్లో ట్రాక్టర్లతో ఇసుక తరలించడం మరో ఎత్తు. రాత్రి వేళల్లో ట్రాక్టర్లతో ఇసుక రవాణా చేస్తున్నారు. ఎవరైనా అక్రమ రవాణాపై ఫిర్యాదు చేసిన అధికారులు, పోలీసులు చూసీచూడన్నట్లుగా వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఇసుక రవాణాపై నిఘా పెంచాల్సిన అవసరం ఉందని స్థానికులు పేర్కొంటున్నారు.
జిల్లా మైనింగ్ అధికారులు దృష్టి సారించాలి ..
పర్మిషన్ ఉన్న ట్రాక్టర్ తో రిచ్ లో లోడ్ చేసుకొని మార్గం మధ్యలో వేరొక ఇంజన్ ను తగిలించుకొని అధిక దరకు అమ్ముకుంటున్నారు. రెవిన్యూ అధికారులు రిచ్ ల దగ్గరకు మాత్రమే పరిమితం అవుతున్నారు. ట్రాక్టర్ ఎటు వెళ్తుంది అనే పర్యవేక్షించడంలో అధికారులు విఫలం అవుతున్నారు.ఇసుక పాలసీలో అక్రమాలకు పాల్పడుతున్న ట్రాక్టర్ యజమానులపై, వారికీ సహకరిస్తున్న అధికారులపై జిల్లా అధికారులు దర్యాప్తు చేసి చర్యలు తీసుకోవాలని స్థానిక మున్సిపాలిటీ, మండలం, గ్రామ ప్రజలు కోరుతున్నారు.