సార బెల్లం పట్టివేత

తెలంగాణ వార్త మద్దిరాల:- మండలంలోని గుట్టకాడి తండ ఆవాసం సేట్రం తండాకు చెందిన కొర్ర శ్రీను ఇంట్లో అక్రమంగా నిల్వ చేసిన క్వింటా బెల్లం, 5 కేజీల పట్టికను విశ్వసనీయ సమాచారం మేరకు పట్టుకున్నామని, అదే తండకు చెందిన నేనావత్ దుర్గమ్మ అక్రమంగా సారాను విక్రయిస్తుండగా ఆమె వద్ద 10 లీటర్ల సారను పట్టుకుని ఇరువురిపై కేసు నమోదు చేయడం జరిగినదని స్థానిక ఎస్సై వీరన్న తెలిపారు. ఈ కార్యక్రమంలో కానిస్టేబుల్ మీరా,చందు, సతీష్ తదితరులు పాల్గొన్నారు.