పరీక్ష ప్యాడ్లు పెన్నులు పంపిణీ మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షుడు బైరెడ్డి సందీప్ రెడ్డి

అడ్డగూడూరు 21 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త రిపోర్టర్:- యాదాద్రి భువనగిరి జిల్లా అడ్డగూడూరు మండల కేంద్రం లోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు అడ్డగూడూరు మండల యువజన కాంగ్రెస్ అధ్యక్షులు తన సొంత డబ్బులతో శుక్రవారం పరీక్ష ప్యాడ్లు, పెన్నులు పంపిణీ చేశారు.ఈ సందర్భంగా బైరెడ్డి సందీప్ రెడ్డి మాట్లాడుతూ..తాను బాల్యంలో చదువుకున్న పాఠశాలలోని విద్యార్థులకు పరీక్ష ప్యాడ్‌లు పంపిణీ చేయడం సంతోషంగా ఉందన్నారు.పాఠశాలలో పదో తరగతిలో క్లాస్ మొదటి ర్యాంక్ సాధించిన విద్యార్థికి 2500 రూపాయలు , సెకండ్ ర్యాంక్ సాధించిన విద్యార్థికి రూ.1500, థర్డ్ ర్యాంక్ సాధించిన విద్యార్థికి రూ.1000 నగదు బహుమతి అందిస్తానని ప్రకటించారు. క్రమం తప్పకుండా శ్రమిస్తే కష్టానికి తగ్గ ఫలితం వస్తుందని, విద్యార్థులు కష్టంతో కాకుండా ఇష్టపడి చదివి మంచి మార్కులు సాధించి భవిష్యత్తులో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని అన్నారు.ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు యు,మహేష్, యు నరేందర్, బి లక్ష్మణ్, ఏన్, వెంకటేష్,జోసెఫ్, స్వప్న, కళ్యాణి,ఈ కార్యక్రమంలో అడ్డగూడూరు పట్టణ కాంగ్రెస్ నాయకులు పరిగల సత్యనారాయణ, తుప్పతి లక్ష్మి నారాయణ, అడ్డగూడూరు మండల యూత్ కాంగ్రెస్ నాయకులు బైరెడ్డి జగదీష్ రెడ్డి, మండల యువజన కాంగ్రెస్ నాయకులు గండేలా రవి, షేక్ సమీర్, షేక్ సోహెల్, బాబు తదితరులు పాల్గొన్నారు*