బైకును ఢీకొన్న కంటైనర్ వ్యక్తి మృతి

తెలంగాణ వార్త మిర్యాలగూడ ఫిబ్రవరి 18
ఈ రోజు ఉదయం 11గం కు మిర్యాలగూడ లోని శరణ్య గ్రీన్ హోమ్ కి చెందిన పెట్నకోటి భారతయ్య, వయస్సు 83 సం.లు పని నిమిత్తం మిర్యాలగూడలో అద్దంకి నార్కట్ పల్లి హైవే పై గల నందిపహాడ్ బైపాస్ జంక్షన్ వద్ద రొడ్ దాటుచుండగా గుంటూరు నుండి హైదరాబాద్ వైపు కు వెళ్లుచున్న ఒక కంటైనర్ నం.MH 04 KF 8358 లారి డ్రైవర్ తన వాహనాన్ని అతి వేగంగా అజాగ్రత్త గా నడిపి స్కూటి నీ టక్కర్ ఇవ్వగాబరతయ్య అక్కడే ఇక్కడికి రోడ్డు పై పడి తలకు తీవ్ర గాయాలు అయి అక్కడే చనిపోయాడు.అదే సమయం లో అట్టి కంటైనర్ డ్రైవర్ అదే స్పీడ్ లో అక్కడే ఉన్న ఒక ఆటో ను టీ స్టాల్ నుపక్కన ఆగి ఉన్న రెండు DCM లను గుద్ది అట్టి ఆటో లో ఉన్న డ్రైవర్ ధనుంజయ కి స్వల్ప గాయాలు కాగా .రెండు DCM లు ధ్వంసం అయినవి.
మృతుడి యెుక్క కుటుంబ సభ్యుల పిర్యాదు మేరకు కంటైనర్ డ్రైవర్ పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు మిర్యాలగూడ టూ టౌన్ పి ఎస్ ఎస్సై రాంబాబు , తెలిపినారు.