ఘనంగా క్రిస్మస్ వేడుకలు

Dec 25, 2024 - 20:34
Dec 25, 2024 - 20:35
 0  2
ఘనంగా క్రిస్మస్ వేడుకలు

తెలంగాణ వార్త ఆత్మకూరు యస్:- ఘనంగా క్రిస్మస్ వేడుకలు ఆత్మకూరు ఎస్... క్రైస్తవుల పర్వదినాన్ని పురస్కరించుకుని బుధవారం క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. మంగళ వారం రాత్రి నుండీ చర్చిల లో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. క్రైస్తవులు ఈ వేడుకల్లో కేక్ లు కట్ చేసి హిందువుల కు స్వీట్స్ పంపిణీ చేసి ఉత్సాహంగా జరుపుకున్నారు. నెమ్మికల్ చర్చి లో 35మంది వితంతువులు,వృద్ధులకు ఫాస్టర్ జేమ్స్ దంపతులు బట్టలు పంపిణీ చేశారు.మండల పరిధిలోని నెమ్మికల్ క్రీస్తు రాజు దేవాలయం లో ఫాదర్ అలెగ్జాండర్, జలగం జేమ్స్, లు కందగట్లలో ఫాస్టర్ బాబు, తో పాటు అన్ని గ్రామాల్లో క్రిస్మస్ వేడుకలు నిర్వహించారు. ఇస్తాలాపురం గ్రామంలో మేరీ క్రిస్మస్ సందర్భంగా యూత్ కాంగ్రెస్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో మండల యూత్ కాంగ్రెస్ వైస్ ప్రెసిడెంట్ కప్పల మహేష్ గౌడ్ గ్రామ కాంగ్రెస్ నాయకులు బీ.లింగయ్య దాసరి మహేష్ డి. శ్రీనివాస్ డీ. ఎస్ కే రఫీ మధు సత్తయ్య మల్లయ్య తదితరులు పాల్గొన్నారు