తునికాకు మోడం వెంటనే నరికించాలి

Feb 22, 2025 - 18:25
Feb 22, 2025 - 19:23
 0  6
తునికాకు మోడం వెంటనే నరికించాలి

 అటవీ ప్రాంతాల్లో వెంటనే తునికాకు మోడెం నరికించాలి.

 పేదలకు ఉపాధి కల్పించాలి

 CPIML మాస్ లైన్ పార్టీ డిమాండ్

చ,ర్ల 22 ఫిబ్రవరి 2025 తెలంగాణవార్త ప్రతినిధి:- జిల్లాలో అటవీ ప్రాంతంలో తునికాకు సేకరణకు మోడం విస్తృతంగా నరికించాలని 50 ఆకుల కట్టకు ఐదు రూపాయలు ధర నిర్ణయించాలని. గత బోనస్ బకాయిలు చెల్లించాలని. బీమా సౌకర్యం కల్పించాలని తదితర డిమాండ్లతో శనివారం చర్ల రేంజర్ అధికారికి CPIML మాస్ లైన్ పార్టీ రాష్ట్ర నాయకులు కె .రంగారెడ్డి, జిల్లా నాయకురాలు కె .కల్పన, దాసరి సాయి, మునిగేలా శివ ప్రశాంత్ సుజాత ,మండల కార్యదర్శి పాలెం చుక్కయ్య ,సరళ ,లక్ష్మక్క, కృష్ణ,నాగరాజు, రాజశేఖర ,రామ్ శెట్టి తదితరులు పాల్గొన్నారు. 

ఈ సందర్భంగా రాష్ట్ర నాయకులు కె. రంగారెడ్డి మాట్లాడుతూ. తునికాకు సేకరణ ద్వారా సుమారు 13 లక్షల మంది కి ఉపాధి లభిస్తుందని ఇది ఏజెన్సీ ప్రాంతంలో వ్యవసాయం తర్వాత ఆదివాసులకు ఇతర పేదలకు రెండో ఆదాయంగా ఉంటుందని ఆయన అన్నారు. కనుక రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇచ్చి తునికాకు సజావుగా నడిపించాలని మోడెం నరికించే పనులు చేపట్టాలని రంగారెడ్డి డిమాండ్ చేశారు. లేనియెడల ఆందోళన చేపడుతామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు.